కమ్యూనిటీ మరుగుదొడ్లకు శంకుస్థాపన


Sun,August 11, 2019 03:38 AM

ధర్మసాగర్, ఆగస్టు 10: మండలంలోని క్యాతంపెల్లి, ధ ర్మసాగర్ గ్రామాల్లో శనివారం సర్పంచ్‌లు పిన్నపురెడ్డి అవనిజ విప్లవ్‌కుమార్‌రెడ్డి, ఎర్రబెల్లి శరత్‌చంద్ర ప్రసాద్ కమ్యూనిటీ మరుగుదొడ్లకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిటీ మరుగుదొడ్లనే కాకుండా ప్రతి ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని సూచించా రు. వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. సకాలంలో నిర్మాణాలను పూర్తి చేసి వినియోగంలోనికి తీసుకరానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు సా యం శేశిరేఖ, పీఆర్ ఏఈఈ దయాకరాచారి, ఉప సర్పంచ్ రాజు, మాజీ ఎంపీటీసీ పెరుమండ్ల మహేందర్, వార్డు సభ్యులు విజ్జిగిరి, గ్రామస్తులు పాల్గొన్నారు.
సకాలంలో నిర్మాణం పూర్తి చేయాలి

కమలాపూర్: కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం వెంటనే పూర్తిచేయాలని పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్ పంచాయ తీ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం మండలంలోని ఉప్పల్ గ్రామంలో కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి భూ మిపూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఇరవై గ్రామాల్లో కమ్యూనిటీ టాయిలెట్ల ని ర్మాణానికి నిధులు మంజూరైనట్లు చెప్పారు. జిల్లాలో మొ త్తం 94 కమ్యూనిటీ టాయిలెట్లు మంజూరైనట్లు తెలిపారు. ఒక్కో టాయిలెట్ నిర్మాణానికి లక్షా 75 వేల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛదర్శన్‌లో కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేర కు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స ర్పంచ్ ఎర్రబెల్లి దేవేందర్‌రావు, ఉపసర్పంచ్ మొర్రి ఓదెలు, పీఆర్ ఏఈ రమేశ్, పంచాయతీ కార్యదర్శి బషీర్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమల తదితరులున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...