ఆటో అడ్డాను ప్రారంభిస్తున్న కార్పొరేటర్ వేణుగోపాల్


Sun,August 11, 2019 03:37 AM

ఆటో డ్రైవర్లకు అండగా తెలంగాణ ప్రభుత్వం
కరీమాబాద్, ఆగస్టు 10 : తెలంగాణ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు అండగా ఉందని 23వ డివిజన్ కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్ అన్నారు. శనివారం ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో హనుమాన్ జంక్షన్ ఆటోస్టాండ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్ మాట్లాడుతూ ఆటోడ్రైవర్లకు అన్నివిధాలా అండగా ఉంటానన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సహకారంతో ఆటోడ్రైవర్లకు చేయూత అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొల్లం రాజు, బత్తుల కుమార్, వెలిదె శివమూర్తి మీరిపెల్లి వినయ్, కొండ రాజు, పరదేశి రాజేశ్, బైరి ప్రతాప్, ఆటోడ్రైవర్లు పసునూరి శ్రీనివాస్, సతీష్, కాశీ విశ్వనాథ్, రామకృష్ణ, రాకేశ్, సంపత్, రాజు, స్వామి, రాజేశ్, బాలు, శంకర్, వెంకటేష్, రంజిత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...