అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్


Sun,August 11, 2019 03:37 AM

ఖిలావరంగల్, ఆగస్టు 10: శివనగర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం 19వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి నాగరాజు పరిశీలించారు. రూ.12 కోట్ల నిధులతో శివనగర్‌లోని 9, 18, 19 డివిజన్‌లను మోడల్ డివిజన్లుగా తీర్చిదిద్దేందుకు ఇటీవల ఎమ్మెల్యే నరేందర్ శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా రూ.6కోట్లను 19వ డివిజన్‌కు కేటాయించారు.

ఈ నిధులతో డివిజన్‌లో అభివృద్ధి పనులను చేపట్టారు. శివనగర్ హాస్టల్‌కు ఇరువైపులా ఉన్న ప్రధాన రహదారులను వెడల్పు చేసే పనులకు శ్రీకారం చుట్టారు. డ్రైన్ టు డ్రైన్ వరకు సీసీ రోడ్లు, ప్రతీ కాలనీకి సీసీ రోడ్డుతోపాటు మురికాల్వలు నిర్మిస్తున్నారు. అలాగే శిథిలమైన రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేటర్ నాగరాజు పర్యవేక్షించారు. నిబంధనల మేరకు రోడ్డు పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌వీ నగరప్రధాన కార్యదర్శి కలకొండ అభినాష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితరులున్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...