యువతకు ఎస్సీ కార్పొరేషన్ అండగా ఉంటుంది


Mon,July 22, 2019 01:31 AM

పర్వతగిరి, జూలై 21 : యువతకు ఎస్సీ కార్పొరేషన్ అండగా ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్ అన్నారు. మండలంలోని వడ్లకొండ గ్రామంలో ఆదివారం గ్రామదర్శిని కార్యక్రమం లో బాగంగా ఎస్సీ కార్పోరేషన్ ఈడీ సురేశ్ బృందం సభ్యులు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఎస్సీ కాలనీలో తిరిగి వారి వారి ఇండ్లలో ఉన్న స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో భాగంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఐదవ తరగతి నుంచి డిగ్రీ పీజీ, బీఎస్సీ, నర్సింగ్ పాస్ అయిన వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.. యువతీ యువకులు ఈసదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో నిరుపేద కుటుంబాలకు మూడు ఎకరాల భూమి కొని ఇస్తామని తెలిపారు. ఆత్మ విశ్వాసంతో ఎస్సీ యు వతీ యువకులు ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, మాజీ ఎంపీపీ రంగయ్య, నాయకులు వెంకన్న, సంపత్‌రావు పాల్గొన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...