కేయూ దూరవిద్య ప్రతిష్టను పెంచాలి


Mon,July 22, 2019 01:30 AM

రెడ్డికాలనీ, జూలై 21: కాకతీయ యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం ప్రతిష్టను పెంచేలా అందరూ సమష్టిగా పనిచేయాలని కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్ సాయన్న అన్నారు. కేయూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ జీ వీరన్న ఆధ్వర్యంలో కేయూ వీసీ సాయన్నను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వీసీ మాట్లాడుతూ దూరవిద్య కేంద్రంలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేసుకోవాలన్నారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోనే కేయూ దూరవిద్య కేంద్రానికి మంచి పేరుందని ఎందరో విద్యార్థులు ఇక్కడ చదివి ఉన్నత హోదాల్లో ఉన్నారని గుర్తు చేశారు. విద్యార్థులకు సరైన సమయంలో అడ్మిషన్లు, తరగతులు నిర్వహించి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. డైరెక్టర్ ప్రొఫెసర్ జీ వీరన్న మాట్లాడుతూ ఎస్డీఎల్సీఈ ఉద్యోగుల సమష్టి సహకారంతో అడ్మిషన్లు పెంచుతామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అందరూ కలిసి పనిచేస్తామని పేర్కొన్నా రు. కార్యక్రమంలో కేయూ అభివృద్ధి అధికారి ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు, అధ్యాపకులు డాక్టర్ జగన్, ఏఆర్ సరళాదేవి, డాక్టర్ సోమరాజు భిక్షపతి, టైంస్కేల్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చల్లా యాదగిరి, బూర సత్యప్రకాశ్, ఎస్డీఎల్సీఈ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుడు డాక్టర్ కొట్టె భాస్కర్, కార్యదర్శి ప్రతాప్, కోశాధికారి గోపి, రహీం అలీ, పీఆర్వో డాక్టర్ ఎఫ్రాంరాజ్ పాల్గొన్నారు.

కేయూ అభివృద్ధి కార్యాలయంలో వీసీకి సన్మానం
కేయూ అభివృద్ధి కార్యాలయంలో అభివృద్ధి అధికారి ఆచార్య వీ రామచంద్రం ఆధ్వర్యంలో వీసీ సాయన్నను ఘనంగా సన్మానించారు. న్యాక్, కాన్వకేషన్ సమయంలో బిల్డింగ్ డివిజన్ చేసిన కృషిని కొనియాడారు. ఇంజినీర్ శ్రీనివాసరావు, భవానీ ప్రసాద్, భూపాల్‌రెడ్డి, ఇతర అధికారులకు నిర్మాణాత్మక సూచనలు చేశారు. నాణ్యతలో రాజీపడొద్దని వారికి సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్, పర్యవేక్షకులు శంకర్‌రావు, జీవన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...