పంటల సాగులో నూతన పద్ధతులు పాటించాలి : ఏడీఏ


Sun,July 21, 2019 01:39 AM

ఖానాపురం, జూలై 20 : పంటల సాగులో అధునాతన పద్ధతులు అవలంబిస్తేనే అధిక దిగుబడులు వస్తాయని నర్సంపేట ఏడీఏ తోట శ్రీనివాసరావు అన్నారు. శనివారం వ్యవసాయాధికారులు ఐనపల్లి శివారులో రైతు ఆంగోత్ రంగ్యా పంట పొలంలో నూతన వరినారు పెంపకంపై రైతులకు క్షేత్రప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడీఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డివిజన్ వ్యవసాయాధికారులు నారుమడిలో ప్లాస్టిక్ కవర్ పరిచి అందులో ట్రేలతో బురద మట్టినింపి వరి విత్తనాలు చల్లి దానిపై వరిగడ్డి వేశారు. ఈ నూతన విధానాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. అనంతరం ఏడీఏ మాట్లాడుతూ ఈ నూతన విధానంలో పెంచిన వరినారును జిల్లాలోనే తొలిసారి ఐనపల్లిలో నిర్వహిస్తున్నమని అన్నారు. ఈ విధనాంలో పెంచిన నారును కేవలం యంత్రాలతోనే నాటువేసుకోవాలని అన్నారు. నారు పోసిన తర్వాత 3 నుంచి నాలుగు రోజులు క్రమపద్ధతిలో నీటిని అందించాలని, వరి మొలకొత్తగానే పైన వేసిన వరిగడ్డిని తొలగించుకోవాలని సూచించారు. రూ.24 లక్షల విలువ చేసే వరినాటు యంత్రాన్ని ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీతో అందజేయనున్నట్లు తెలిపారు. వ్యక్తిగతంగా రూ.1.34 లక్షల విలువ చేసే వరినాటు యంత్రాలను త్వరలో అందజేయనుందని అన్నారు. ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి,జిల్లా డైరెక్టర్ బొప్పిడి పూర్ణచందర్‌రావు,రత్నాకర్‌రావు, వాసుదేవరెడ్డి, ఏఈ శ్రీనివాస్, పరమేశ్ పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...