వరినాట్లకు అన్నదాత సిద్ధం


Sat,July 20, 2019 05:56 AM

శాయంపేట, జూలై 19 : అన్నదాత వరి నాట్లకు సిద్ధమవుతున్నాడు. బావుల కింద నార్లు పోసిన రైతులు నాట్లు వేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. వానకాలం సీజన్ మొదలై నెల రోజులు దాటిన ఆశించిన మేరకు వర్షాలు పడలేదు. అయితే అప్పుడప్పుడూ కురిసిన వర్షాలకు పత్తి పంటలకు ఊపిరి పోస్తున్నాయి. మండలంలో సుమారు రెండు వేల హెక్టార్లు వరి రైతులు సాగు చేస్తారు. జిల్లాలోని రెండో పెద్ద జలాశయమైన చలివాగు కింద 3,046 ఎకరాల ఆయకట్టులో వరి సాగు చేస్తారు. అయితే ఇప్పటి వరకు వర్షాలు లేక చెరువులు, కుంటల్లో నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో బావుల కింద రైతులు వరినార్లు పోశారు. నాట్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శాయంపేట, మైలారం, పత్తిపాక తదితర గ్రామాల్లో వరి నార్లు పోశారు. అయితే కొన్ని రోజులుగా ఎండలు మండిపోవడంతో వరి నారు నీళ్లు లేక ఎండిపోయే దశకు చేరింది. గురువారం రాత్రి భారీ వర్షం పడింది. దీంతో శుక్రవారం రైతులు బావుల కింద పొలాలను గొర్రు కొట్టించి నాట్లు వేస్తున్నారు. బావుల్లో నీళ్లు ఉండటం, వర్షాలు పడుతాయన్న ఆశతో నాట్లు వేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రెండు, మూడు భారీ వర్షలు పడితే చెరువులు నిండిపోతాయని ఎదురు చూస్తున్నారు. ఇక వర్షం పడటంతో శుక్రవారం ఉదయం ఎరువుల దుకాణాల ముందు సందడి నెలకొంది. ఎరువుల కోసం రైతులు దుకాణాలకు చేరుకోవడంతో కిటకిటలాడాయి.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...