వేగం మితిమీరితే.. ఇంటికే జరిమానా


Sat,July 20, 2019 05:55 AM

వరంగల్ క్రైం, జూలై19 : వాహనాదారులు హద్దులు దాటి రోడ్లపై వేగంగా డ్రైవింగ్ చేసే వారి ఇంటికి నేరుగా జరిమానా వస్తుందని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వీ రవీందర్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వరంగల్ కమిషనరేట్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన స్పీడ్ లేజర్‌గన్‌ను సీపీ శుక్రవారం నిట్ కళాశాల సమీపంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల్లో మితిమీరిన వేగాలతో డ్రైవింగ్ చేయడం వల్ల చాలా మంది మృతి చెందుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ప్రమాదాలను అరికట్టేందుకు స్పీడ్ లేజర్ గన్‌ను వినియోగించబోతున్నట్లు పేర్కొన్నారు. మూడు లేజర్ గన్స్ కమిషనరేట్‌లో ఉండగా సెంట్రల్ జోన్‌లో ఒకటి మరో రెండు వెస్ట్, ఈస్ట్ జోన్లలో వినియోగిస్తున్నట్లు వివరించారు. హైవేలపై 80, నగర రోడ్లపై 30 స్పీడ్ దాటి వెళ్లే రోడ్లను స్పీడ్ లేజర్ గన్ గుర్తించి వాహనాన్ని వేగంగా నడుపుతున్నందుకు జరిమానా విధిస్తున్నట్లుగా సెల్‌ఫోన్‌కు సమాచారం చేరవేస్తుందని చెప్పారు. ప్రతీ సంవత్సరం కొత్తగా 30 వేల వాహనలు రోడ్లపైకి వస్తున్నందున ఇలా వాహనాలు పెరిగిపోవడంతో ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని, ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రమాదాలను నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీసీ మజీద్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...