నీటి సమస్యను అధిగమించాలి


Fri,July 19, 2019 03:53 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని నీటి సమస్యను అధిగమించడానికి అన్ని వర్గాల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలికట్టుగా పనిచేయాలని కలెక్టర్ హరిత సూచించారు. మండలంలోని బండౌతాపురం గ్రామంలో జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా గురువారం హరితహారం మొక్కలను రోడ్డుకు ఇరువైపులా నాటించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు అధ్యక్షతన జరిగిన జలశక్తి అభియాన్ అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో తాగు నీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజుల్లో ఈ సమస్య తెలంగాణలో కూడా వచ్చే పరిస్థితి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రజలంతా సంఘటితమై భూగర్భ జలాలను పెంచుకోవాలని ఆమె సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూ గర్భ జలాలను పెంచడంతో పాటు వాతావర ణ సమతుల్యత కోసం ప్రయత్నిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్ల వ్యయంతో హరితహారం కార్యక్రమం చేపడుతోందన్నా రు.ప్రస్తుత పరిస్థితులపై అవగాహన పెంచుకోవడంతో పాటు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలను ప్రతీ ఒక్కరు తీసుకోవాలని కోరారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగా మొక్కలు నాటడడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా ఫాంపాండ్‌లు, ఇంకుడుగుంతలు నిర్మించడం, నీటిని వృథా చేయకుండా అవసరం మేరకే వాడుకోవడంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతీఒక్కరు బాధ్యతగా జలశక్తి అభియాన్, హరితహారం కార్యక్రమాలలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.

పాఠశాలను పరిశీలించిన కలెక్టర్
మండలంలోని బండౌతాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాల ఆవరణలో పిల్లలు, ఉపాధ్యాయులతో మొక్కలు నాటించడంతో పాటు మొక్కలను సంరక్షించే బాధ్యతను ఉపాధ్యాయులు, విద్యార్థులు తీసుకోవాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు పాఠశాల భవనం జీర్ణావస్థకు చేరుకుందని తెలపడంతో ఆమె పాఠశాల భవనాన్ని పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయించడంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో అదనపు గదులను కూడా నిర్మించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అంతేకాక అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాలకు అనుబంధంగా నడిపించి పిల్లల్ని తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. కార్యక్రమాల్లో డీఆర్‌డీవో మిట్టపల్లి సంపత్‌రావు, ఆర్డీవో మహేందర్‌జీ, డీపీవో నారాయణరావు, ఏపీడీ పరమేశ్వర్, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ మార్గం బిక్షపతి, ఎంపీడీవో కల్పన, వైస్ ఎంపీపీ కౌసల్య, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, బండౌతాపురంసర్పంచ్ మరుపట్ల అరుణసాయికుమార్, ఎంపీటీసీ సురేశ్, ఎపీవో నాగేశ్వర్, ఏపీఎం వేణు పాల్గొన్నారు.

రాయపర్తిలో..
రాయపర్తి : మానవాళి జీవితంలో మొక్కలు నిర్వర్తించే పాత్ర వెలకట్టలేనిదని కలెక్టర్ హరిత అన్నారు. జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలను ఆమె సందర్శిం చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో హరితహారం మొక్కల ను నాటారు. అనంతరం కలెక్టర్ హరిత మా ట్లాడుతూ వృక్షాలు లేని సమాజాన్ని ఊహించడమే కష్టమన్నారు.అన్ని ప్రాంతాల్లో ప్రజలు విరివిగా మొక్కలు నాటి, సంరక్షించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో వరంగల్ ఆర్డీవో మహేందర్‌జీ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్యామ నీరజ, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్, ఎంపీడీవో మామిడాల రాజన్న, ఎంఈవో నోముల రంగయ్య, గురుకులం ప్రిన్సిపాల్ చావ జ్యోతి, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ అయిత రాంచందర్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...