మున్సిపల్ ఎన్నికలకు సహకరించాలి : కమిషనర్


Fri,July 19, 2019 03:51 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, జూలై 18 : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ సూచించారు. మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో గురువారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని తండాలు, పట్టణాన్ని కలుపుకుని మొత్తంగా 12వార్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను, పరిధిని ఇప్పటికే ప్రకటించినట్లు వివరించారు. జరిగిందని చెప్పారు. అంతేకాక ఎన్నికల పోలింగ్ స్టేషన్‌లకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను కూడా విడుదల చేసినట్లు పేర్కొనారు. ఇందుకు సంబంధించిన ఎలాంటి అనుమానాలు ఉన్నా ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు.

ఎన్నికల అధికారులతో సమావేశం
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, అసిస్టెంట్ అధికారులను నియమిస్తున్నట్లు కమిషనర్ రవీందర్ తెలిపారు. 1,2,3వార్డులకు ఎన్నికల అధికారిగా ల్యాబర్తి పీజీ హెచ్‌ఎం ఎస్ సదానందం, అసిస్టెంట్ అధికారిగా ఇల్లంద పాఠశాల ఉపాధ్యాయుడు వీ రాజు, అలాగే 4 నుంచి 6వ వార్డు వరకు వర్ధన్నపేట పీజీ హెచ్‌ఎం ఆర్ సదానందం, అసిస్టెంట్ అధికారిగా ల్యాబర్తి పాఠశాలకు చెందిన కే బాబురావు, 7 నుంచి 9 వార్డులకు వర్ధన్నపేట పీజీ హెచ్‌ఎం నర్సింహాచారి, అసిస్టెంట్ అధికారిగా ఎస్ పురుషోత్తం, 10 నుంచి 12 వార్డులకు రామవరం పీజీహెచ్‌ఎం రవికుమార్, అసిస్టెంట్ అధికారిగా టీ.రమేశ్‌ను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎన్నికల అధికారులకు కమిషనర్ ఎన్నికల నిబంధనలను సమగ్రంగా వివరించారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...