టెక్నాలజీ మానవ అవసరాలకు ఉపయోగపడాలి


Wed,July 17, 2019 04:09 AM

నర్సంపేట రూరల్, జూలై16 : నూతన టెక్నాలజీ మానవ అవసరాలకు ఉపయోగపడేలా విద్యార్థులు కృషి చేయాలని ఐఈఈఈ హైదరాబాద్ సెక్షన్ సెక్రటరీ పీ బాలాప్రసాద్ అన్నారు. మండలంలోని ముగ్ధుంపురం గ్రామ శివారు జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు ఐఈఈఈ విద్యార్థులకు నిర్వహించే అభిజ్ఞత-2019 సదస్సు మంగళవారం ప్రారంభమైంది. కళాశాల సంయుక్త కార్యదర్శి టీవీఆర్‌ఎన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానాకి ముఖ్యఅతిథిగా హాజరైన బాలాప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరు నూతన అంశాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. విద్యార్థులు చిన్న చిన్న ప్రాజెక్టులను తయారు చేయడం ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు సమయాన్ని ఏమాత్రం వృథా చేయకూడదని సూచించారు. సీఈవో లక్క రాజుచరణ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రాథమిక అంశాలపై పట్టు కలిగి నూతన అంశాలను, ఇన్నోవేటింగ్ ఆలోచనలు కలిగి ఉండాలన్నారు. నేర్చుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉండాలని సూచించారు. అధ్యాపకులు విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.కళాశాల డైరెక్టర్ కిషన్‌రావు మాట్లాడుతూ విద్యార్థులు అంతర్జాతీయ సాంకేతిక వేదికైన ఐఈఈఈలో పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పీ రంగయ్య, ప్రిన్సిపాల్ లోక్‌నాథ్‌రావు, డాక్టర్ నరేశ్, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ప్రాజెక్టులు
విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన టెక్నికల్ పేపర్ ప్రజంటేషన్, క్విజ్ మాక్, ఇంటర్వ్యూ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోలార్ బేసిడ్ మల్టిఫర్‌పస్, అగ్రికల్చర్ పరికరం, సోలార్ బేసిడ్ వాటర్ పంపింగ్ సిస్టం, బ్రిడ్జిడెక్, అడవుల సంరక్షణ, ఆన్‌లైన్ డాటా తదితర ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. వరినాట్లు వేయడం, వరి కోయడం, మందులు పిచికారీ లాంటివి ప్రయోగపద్ధతిలో విద్యార్థులు ప్రాజెక్టుల ద్వారా వివరించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...