ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి


Tue,July 16, 2019 05:05 AM

శాయంపేట, జూలై 15 : హరితహారంలో నాటిన ప్రతీ మొ క్కను కాపాడుకోవడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మనం ఇచ్చే కానుక అని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి అన్నా రు. శాయంపేట మండలంలో ఆమె సోమవారం హరితహారం లో విస్తృతంగా పాల్గొన్నారు. పత్తిపాక గ్రామంలో జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరితతో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే ఆరెపల్లి, మాందారిపేట శివారులోని కస్తూర్బా బాలికల విద్యాలయంలోను హరితహారంలో చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ రాష్ర్టాన్ని హరిత తెలంగాణ గా మార్చేందుకు ఎంతో దూరదృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదేళ్లుగా హరితహారాన్ని చేపట్టి మొక్కలను ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా విధిగా నాలుగు మొక్కలను నాటాలని కోరారు. మొక్కలను తీసుకుని నాటడంతోనే మర్చిపోవద్దని తప్పకుండా కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు ప్రయోజనం కలుగుతుందని ఇదే సీఎం కేసీఆర్‌కు మనమంతా ఇచ్చే అసలైన కానుక అని పేర్కొన్నారు. ఇప్పుడు విరివిగా మొక్కలను నాటి సంరక్షించకపోతే రాబోయే రోజుల్లో వర్షాలు పడే పిరిస్థితి లేదని, కాలుష్యం పెరిగిపోయి మానవ మనుగడ కష్టతరంగా మారే అవకాశాలున్నట్లు చెప్పారు. ప్రతీ గ్రామంలోనూ నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు.

శాయంపేట మండలంలో హరితహారాన్ని విజయవంతం చేస్తున్నామని అనంతరం జిల్లాలోని 16 మండలాల్లోనూ హరితహారం కార్యక్రమాన్ని తాను పర్యవేక్షిస్తానని చెప్పారు. అలాగే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలను నిర్మించుకుని వర్షపు నీటిని వృథాగా పోకుండా చూసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులను మంజూరు చేయించి మరమ్మతులు చేస్తానన్నారు. కస్తూర్బా పాఠశాలలో తాగునీటి ఇబ్బందిని త్వరలోనే తీరుస్తానన్నారు. జిల్లా పరిషత్ సీఈవో రాజారావు మాట్లాడుతూ ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతను నిర్మించుకోవాలన్నారు. రెండున్నర ఎకరాలున్న ప్రతీ రైతు కూడా సేద్యపు కుంటను నిర్మించుకోవాలని ఇందుకు ఉపాధి హామీలో నిధులు ఇస్తామన్నారు. నీరు, చెట్టు ప్రధానమైనవరి వీటిని నిర్లక్ష్యం చేస్తే రాబోయే తరాలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఉపాధి హామి ఏపీవో, టీఏ, ఎఫ్‌ఏలు రైతులు, ప్రజలతో మమేకమైన వీటిని ఎక్కువగా నిర్మించేందుకు కృషి చేయాలన్నారు. శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో కలెక్టర్ హరిత సోమవారం హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలాగే మొక్క వృథాగా పోకుండా ఉండాలని అక్కడే కర్రను సపోర్టుగా తీసుకుని దారంతో కట్టుకట్టి అందరికి ఆదర్శంగా నిలిచారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి హరితహారంలో పత్తిపాకలో కలెక్టర్ హరిత మొక్కలు నాటారు. పత్తిపాక సృజన గ్రీన్‌ల్యాండ్ నుంచి రోడ్డు పక్కన ఎవెన్యూ ప్లాంటేషన్‌లో కలెక్టర్ హరిత, జెడ్పీ చైర్‌పర్సన్ జ్యోతి కలిసి పలుచోట్ల మొక్కలను నాటారు. రోడ్డంతా పిల్లలు, స్థానికులు, ప్రజాప్రతినిధులతో మొక్కలు నాటించారు. అక్కడి నుంచి విద్యార్థులతో కలిసి ర్యాలీగా వచ్చిన కలెక్టర్, చైర్‌పర్సన్‌లు జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలలోను మొక్కలను నాటారు. మొక్క చుట్టు ట్రీగార్డ్స్‌ను ఏర్పాటు చేసి రోజు నీళ్లు పోస్తు రక్షించుకోవాలన్నారు. నాటి వదిలస్తే మొక్కలు పెట్టిన ఫలితం ఉండదని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా హరితహారంలో మొక్కలను నాటాలని, అవి పెరిగేంత వరకు రక్షించుకుని భావి తరాలకు మేలు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జీసీడీవో సంధ్యారాణి, ఎంపీపీ మెతు కు తిరుపతిరెడ్డి, సర్పంచ్‌లు చిట్టిరెడ్డి రాజిరెడ్డి, దుంపల లత, అబ్బు ప్రకాశ్‌రెడ్డి, రవి, వైస్ ఎంపీపీ రాంశెట్టి లత, పీఏసీఎస్ చైర్మన్ రాజిరెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీవో అనురాధ, ఎంఈవో రాజిరెడ్డి, ఈవోపీఆర్డీ సరస్వతి, ఏపీవో అనిత, ఏవో గంగాజమున, ఎంపీటీసీ ఐలయ్య, హెచ్‌ఎంలు రవీందర్, సమ్మిరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్, పోలెపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దూదిపాల తిరుపతిరెడ్డి, తదితరులున్నారు.

141
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles