కదిలొచ్చిన గోదారి


Tue,July 16, 2019 05:04 AM

కాళేశ్వరం, జూలై 15 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అపర భగీరథుడు కేసీఆర్ జల స్వప్నం సాకారమవుతోంది. ప్రాణహిత నది నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద మోటార్ల రన్‌తో ఎదురెక్కుతున్న గోదావరి ఇప్పటికే అన్నారం బ్యారేజీకి 4.59 టీఎంసీల నీరు వరకు ఎత్తిపోసింది. రేపటితో 6టీఎంసీలకు నీరు చేరుకుంటే.. ఇక అన్నారం పంప్‌హౌస్ నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీరును తరలించనున్నారు. దీంతో సుందిళ్ల బ్యారేజీ వరకు గోదావరి నిండుకుండగా మారబోతుంది. కాళేశ్వరం వద్ద కనీవిని ఎరుగని రీతిలో ఈ అద్భుతం చోటుచేసుకోగా, ఇంజినీరింగ్ అధికారుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. రైతాంగం, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎదురెక్కి ఎత్తిపోస్తున్న గోదావరిని చూసేందుకు సందర్శకులూ ఎగబడుతున్నారు. కాగా, కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రస్తుతం 5మోటా ర్లు నడుస్తుండగా రోజుకో 1 టీఎంసీ చొప్పున గ్రావిటీ కెనాల్ నుంచి అన్నారం బ్యారేజీకి ఎత్తిపోస్తుంది. సోమవారం కూడా ఈ పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయడంతో అ న్నారం బ్యారేజీ వద్ద మొత్తంగా 4.59 టీఎంసీల వరకు నీటి సామర్థ్యం పెరిగింది. అన్నారం బ్యా రేజీలో గోదావరి నీరు గేట్ల వద్ద 9.87 మీటర్లగా నీరు చేరుకున్నాయి. (బ్యారేజీ వద్ద గోదావరి లెవల్ 106 మీటర్ల నుంచి 115.700 మీటర్లకు చేరుకున్నాయి)అన్నారం బ్యారేజీలో గోదావరి నీరు 32కిలో మీట ర్ల వరకు గోదావరి నీరు రివర్సింగ్ నీరుతో నిండుకుంది. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్ నీరు 25కిలో మీటర్లకు చేరుకుంది. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద గోదావరి నీరు 12,000 వేల క్యూసెక్కులుగా పారుతుందని ఇంజినీర్లు తెలిపారు. మంగళవారం పంప్‌హౌస్‌లోని 2వ మోటార్‌ను సైతం ప్రారంభించేందుకు అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పనులు చకచకా జరుగుతున్నాయి. కన్నెపల్లిలోనే మకాం వేసి ప్రతీ పని దగ్గరుండి పర్యవేక్షస్తున్నారు. పంప్‌హౌస్ నుంచి మొత్తంగా 6మోటార్లు నీటిని ఎత్తిపోయనుండగా, అన్నారం బ్యారేజీ వద్ద పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరగనుంది. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద సాయంత్రం 4, 5వ మోటార్లను సాకేంతిక కారణలతో ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేశారు. ఇప్పటికే గోదావరి నిండుకుండగా మారుతుండటంతో మత్స్యకారులు సైతం చేపల వేటలో నిమగ్నమయ్యారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...