మౌలిక వసతులు కల్పిస్తాం..


Mon,July 15, 2019 02:58 AM

-ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
-రూ.1.91 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం
మామునూరు, జూలై 14: రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో కనీస మౌలిక వసతులు కల్పించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించ డమే ప్రభుత్వ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అ న్నారు. నగరంలోని ఐదో డివిజన్‌లో గల రామక్రిష్ణాపురం, బొల్లికుంట, గాడిపల్లి గ్రామాల్లో స్థానిక కార్పొరేటర్‌ పసునూరి స్వర్ణల త ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశా రు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రా రంభించారు. మొత్తం రూ. 1 కోటి 91 లక్షల వ్యయంతో ఈ పను లు చేపట్టనున్నారు. రామక్రిష్ణాపురంలో రూ. 90 లక్షలతో సీసీ రోడ్డు, సైడు కాలువల నిర్మాణ పనులు, బొల్లికుంటలో రూ. 20 లక్షలతో శ్మశానవాటికలో భవన నిర్మాణం, బోరుబావి, టాయిలెట్లు, ప్రహరీ పనులు చేపట్టనున్నారు. గాడిపెల్లిలో రూ. 81 లక్షల వ్యయంతో దూపకుంట క్రాస్‌ రోడ్డు నుండి గాడిపెల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ధర్మారెడ్డి ఆయా గ్రామాల్లో శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా రామక్రిష్ణాపురంలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని ప్ర తీ కుటుంబానికి తాగునీరు, మెరుగైన రహదారులు, నిరంతర వి ద్యుత్‌ సరఫరాలాంటి సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదే శించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ధర్మారెడ్డి సంబంధిత ఏఈని ఆదేశించారు. కార్యక్రమంలో సంగెం జె డ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, సంగెం మాజీ ఎంపీపీ వీరాచారి, డివిజన్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు పసునూరి వజ్రయ్య, మాజీ సర్పంచ్‌ భూ మాత, రామస్వామి, ఎల్లగౌడ్‌, సాగర్‌రెడ్డి, ఎర్ర స్వామి, దయాకర్‌, భిక్షపతి, ఎర్ర శోభన్‌బాబు, శ్రీకాంత్‌, క్రాంతి, శ్రీధర్‌, గాడిపెల్లిలో కత్తెరపల్లి దామోదర్‌, రాంబాబు, శాంత, భరత్‌, మధు, సూరయ్య, భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...