మల్లారంలో సివిల్ ఎస్సైలుగా ముగ్గురు


Sun,July 14, 2019 02:11 AM

భీమదేవరపల్లి: మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన చింతరాజు, పిట్టల తిరుపతి, బొల్లం వినయ్ సివిల్ ఎస్సైలుగా ఎంపికయ్యారు. మల్లారం గ్రామానికి చెందిన చింత రాజు కరీంనగర్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ఇటీవల వచ్చిన గ్రూపు-4 ఫలితాల్లో 159వ ర్యాంకు సాధించాడు. ఈ క్రమంలో శనివారం వెలువడిన సివిల్ ఎస్సై ఫలితాల్లో 273 మార్కులు సాధించి ఎస్సైగా ఎంపికయ్యాడు. ఇదే గ్రామానికి చెందిన పిట్టల తిరుపతి ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నా డు.

తిరుపతి బాసర త్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. సివిల్ ఎస్సై ఫలితాల్లో 274మార్కులు సాధించి ఎస్సైగా ఉద్యోగం సాధించాడు. బొల్లం వినయ్ ఇటీవలే డిగ్రీ పూర్తిచేశాడు. పోటీపరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలో సివిల్ ఎస్సైగా ఎంపికయ్యాడు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఎస్సైలుగా ఎంపిక కావడంపై ఎంపీపీ జక్కు ల అనిత, జెడ్పీటీసీ సభ్యుడు వంగ రవి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి రాజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మండల సురేందర్, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రఘు హర్షం వ్యక్తం చేశారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...