అంతర్జాతీయ స్థాయిలో


Sun,July 14, 2019 02:06 AM

గుర్తింపు తేవాలి : కార్పొరేటర్ గణేశ్జి క్రీడాకారులు తమ ప్రతిభ పాటవాలతో అంతర్జాతీయ స్థాయిలో ఓరుగల్లుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని 27వ డివిజన్ కార్పొరేటర్ వద్దిరాజు గణేష్ అన్నారు. ఉదయం జరిగిన పోటీల ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన క్రీడాకారులకు తమ అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు దూసుకెళ్లాలని సూచించారు. జాతీయ జూడో ఫెడరేషన్ సమాఖ్య కోశాధికారి కైలాస్‌యాదవ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులకు మంచి గుర్తింపు ఇస్తున్నాయన్నారు.

క్రీడాకారులు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు.కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు కోట సతీశ్, భిక్షపతి, సీనియర్ క్రికెటర్, అంఫైర్ మట్టెడ కుమార్, నవీన్‌కుమార్, ప్రభాకర్, అశోక్‌కుమార్, అక్తర్, రహ్మత్, రాజు, రాజశేఖర్, ఆంటోని, రబ్బానీలు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...