అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి


Fri,July 12, 2019 02:20 AM

గీసుగొండ, జూలై 11 : కార్పొరేషన్ పరిధి గ్రామాల్లో జరుగుతన్న పనుల ను వెంటనే పూర్తి చేయాలి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హన్మకొండలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో కా ర్పొరేషన్ అధికారులలో ఆయన సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడారు. 2, 3, 4 డివిజన్లలో రూ.5కోట్లతో జరుగుతున్న పనుల ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పనులు ప్రారంభమై నెలల గడుస్తున్నా ఎందుకు పూర్తి కావడం లేదని ఆయన అధికారులను ప్ర శ్నించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేసి డివిజన్ల మరో రూ.10 కో ట్లతో చేపట్టే పనులను త్వరలో ప్రారంభించేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారుల అలసత్వం వల్లే పనుల్లో జాప్యం జరుగుతుందని చల్లా అసహనం వ్యక్తం చేశారు. రూ.కోట్ల నిధులను కార్పొరేషన్ పరిధి గ్రామాల కు కేటాయిస్తున్న పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. కార్పొరేషన్ పరిధి గ్రామాల్లో ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందేలా చూడాలని ఆదేశించారు. వరంగల్ పట్టణానికి అనుకోని ఉన్న డివిజన్లలో పనులు ఆలస్యం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులు నిత్యం అభివృద్ధి పనులపై సమీక్షలు చేస్తు పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పనిచేయని కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని ధర్మారెడ్డి సూచించారు. కార్పొరేషన్ పరిధి గ్రామాల్లో ఎక్కడా కూడా పనులు ఆగకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పనిచేయని కాంట్రాక్టర్లపై అధికారులు శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో కావాల్సిన మౌలిక వసతులకు అధికారులు పూర్తి సమాచారంతో ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు లింగం మౌనిక, బిల్లా కవిత, ల్యాదెలా బాలయ్య, స్వర్ణలత, వజ్రయ్య, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ప్రణాళికలు రూపొందించాలి
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, బయోమెడికల్ వేస్ట్, నదుల కా లుష్యం, ఎయిర్‌పొల్యుషన్, సౌండ్ మైనింగ్ అంశాలకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకనుగుణంగా జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి ఎన్‌జీటీ జారీచేసిన ఉత్తర్వుల అమలుపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్, సీబీసీ సెక్రటరీ అనిల్‌కుమార్, పంచాయితీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్, హైదరాబాద్ కలెక్టర్ మానిక్‌రాజ్, టీఎస్‌ఎండీసీ ఎండీ మల్సూర్, మైన్స్ డైరెక్టర్ సుశీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎస్ జోషి మాట్లాడుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, నదులు, వాయుకాలుష్యం, బయోమెడికల్ వేస్ట్ తదితర అంశాలపై జిల్లా కమిటీలు ప్రతీ నెల సమావేశమై మినిట్స్‌ను పంపించడంతోపాటు త్రైమాసిక నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి జీహెచ్‌ఎంసీ జీడిమెట్లలో ఏర్పాటు చేసిన ప్లాంటును రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లకు చూపించాలన్నారు. పట్టణ, గ్రామాలకు డంపింగ్ యార్డులు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెత్తను సేకరించే వారికి తడి, పొడి చెత్త వేరుచేయడంపై హౌస్‌హోల్డ్స్‌ను చైతన్యం చేసేలా జిల్లాస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని, చెత్త సేకరణకు అవసరమైన ఆటోలు, రిక్షాలు సమకూర్చాలని అన్నారు.
ప్రతీ జిల్లాలోని మూడు గ్రామాల్లో పూర్తిస్థాయిలో అక్టోబర్ 29వ తేదీ నాటికి సాలిడ్ వేస్ట్‌కు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. డంపింగ్ యార్డుల ఏ ర్పాటు, చెత్త సేకరణ, ప్రాసెసింగ్, వేరుచేయడం, డిస్పోజల్ తదితర అంశాలపై కలెక్టర్లతో మాట్లాడారు. వివిధ జిల్లాల్లో మైనింగ్ అనంతరం వినియోగంలో లేని క్వారీల వివరాలను కలెక్టర్లకు పంపాలని, వాటిని ఘనవ్యర్థాల నిర్వహణకు వినియోగించుకునేలా చూడాలన్నారు. జిల్లాల్లో ఈ అంశాలకు సంబంధించి కమిటీ ప్రత్యేక సమావేశం ప్రతీనెల నిర్వహించి నివేదికను పీసీబీకి పంపాలన్నారు. బయోమెడికల్ వేస్ట్‌కు సంబంధించి రాష్ట్రంలో ఉన్న ఆస్పత్రులను 11 ఇన్సులేటరీ యూనిట్స్‌కు ట్యాగ్ చేయాలన్నారు. రిజిష్టర్‌కాని ఆస్పత్రులను రిజిష్టర్ అయ్యేలా చూడాలని సీఎస్ సూచించారు. నదుల పొల్యూషన్ స్ట్రెచెస్‌కు సంబంధించి జిల్లాల వారీగా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధచూపాలని, అక్రమ ఇసుక మైనింగ్, శుద్ధిచేయని వ్యర్థాలు కలువకుండా చూడాలని కోరారు. నగరీకరణ, పారిశ్రామికీకరణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని వాయు కాలుష్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అవసరమైన చోట ఎయిర్‌క్వాలిటీ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక మైనింగ్‌కు సంబంధించి సైంటిఫిక్ పద్ధతిలో చేయాలన్నారు. అక్రమ మైనింగ్ జరగకుండా కలెక్టర్లు చూడాలని ఆదేశించారు.

అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా మాట్లాడుతూ జిల్లాస్థాయి కమిటీలు నెలవారి సమావేశాలు నిర్వహించాలని, త్రైమాసిక నివేదికలలో ఆ పీరియడ్‌లో రెగ్యులర్‌గా చేపడుతున్న కార్యక్రమాలు, చర్యల వివరాలతోపాటు ఆ పీరియడ్‌లో కొత్తగా చేపట్టిన అంశాలను ప్రత్యేకంగా పేర్కొనాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు జిల్లాల్లో తీసుకున్న చర్యల నివేదికలను క్రోడీకరించి ఎన్‌జీటీకి సమర్పిస్తామని తెలిపారు. ఈ అంశాలకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను కలెక్టర్లకు పంపుతున్నామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీవో పీడీ సంపత్‌రావు, డీపీవో నారాయణ తదితరులు పాల్గొన్నారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...