మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి


Fri,July 12, 2019 02:18 AM

నర్సంపేట, నమస్తేతెలంగాణ : మున్సిపల్ ఎ న్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని నర్సంపేట ఎ మ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. గురువారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు 200పైగా చేరడంతో వారికి పెద్ది కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడారు. రానున్న ము న్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చే సే అభ్యర్థుల విజయానికి పాటుపడాలని పిలుపు నిచ్చారు. పార్టీల శ్రేణులు ఐక్యతతో గెలుపుకోసం కృషి చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభు త్వం గత ఐదేళ్ల కాలంలో చాలా రకాల సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ఈ పథకాలతో లబ్ధిపొందిన వారు చాలా మంది ఉన్నారని అన్నారు. వార్డుల వారీగా జాబితాలు సేకరించి ఇంటింటి వెళ్లాలని కోరారు. లబ్ధిదారులను కలిసి తప్పకుండా టీఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించేలా చే యాలని ఆయన సూచించారు. అన్ని వర్గాల ప్ర జల బాగోగులను పట్టించుకుంది ఒక్క టీఆర్‌ఎస్ పార్టీయేనని అన్నారు. నిరుపేదలు ఆర్థికంగా బలపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు ఎం తగానో తోడ్పడుతున్నాయని తెలిపారు. పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలని కో రారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. మహిళలు పొదుపులను క్రమం తప్పకుండా చేసుకుంటూ వెళితే పొదుపు సంఘాలకు నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా నిధులు అందిస్తున్నామని అన్నారు. వివిధ పనులు చేసుకునే విధంగా స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. స్కిల్ సెంటర్ల ద్వారా శిక్షణ పొందిన మహిళలు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకుంటున్నారని అన్నారు. కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు కదులుతున్నామని అన్నారు. పరిశ్రమల శాఖ నుంచి నిధులు మంజూరు చేయించి నర్సంపేటలో మహిళలకు పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయించామని వెల్లడించారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా, ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లేలా చేస్తున్నామని ఆయన వివరించారు. వృద్ధు లు, వికలాంగులు, వితంతువులు ఇలా పింఛన్ దారులను ఆదుకున్నది తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పింఛన్‌ను కూడా రూ.2016లకు పెంచి ఇస్తున్నట్లు తెలిపా రు. పింఛన్‌దారుల వయస్సు65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించామని అన్నారు. వృద్ధులు ఆత్మగౌరవంతో జీవించేలా చేశామని వివరించారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలను వర్తింప చేస్తున్నట్లు తెలిపారు. నర్సంపేట అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఇప్పటివరకు పట్టణానికి రూ.35 కోట్లతో పనులు జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, కొంకీస కుమార్‌గౌడ్, నాగిశెట్టి ప్రసాద్, రాణాప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...