డైరెక్ట్ వెట్న్ !


Thu,June 20, 2019 03:37 AM

- చరిత్రలో నిలిచిపోనున్న కన్నెపల్లి పంపుహౌస్
- 40 మెగావాట్ల మోటార్ల వెట్న్ ఇక్కడే తొలిసారి
- డ్రై రన్ లేకుండా డైరెక్ట్ వెట్న్
- కల్వకుర్తి రికార్డును అధిగమించనున్న కాళేశ్వరం
- పంపుహౌస్‌లో 17 మోటార్లు
- నాలుగు దేశాల నుంచి వచ్చిన మోటార్ల విడి భాగాలు
- డెలివరీ సిస్టర్న్ వరకు 3.3 మీటర్ల డయాప్రెషర్ పైపులైన్
- ఎత్తిపోత నీరు తరలింపునకు 13.34 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్
జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ:సాగునీటి రంగంలో రికార్డులు సృష్టించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో కన్నెపల్లి పంపుహౌస్ అత్యంత కీలకమైనది. ఎత్తిపోతలో ఈ పంపుహౌస్ చరిత్రలో నిలిచిపోనుంది. ఎందుకంటే నలభై మెగావాట్ల మోటార్లు గల ఒక పంపుహౌస్‌లో డైరెక్ట్‌గా వెట్న్ జరుగనుండడం ఇక్కడే ప్రథమం. ఇతర పంపుహౌస్‌ల మాదిరిగా ఎత్తిపోత కోసం కన్నెపల్లి పంపుహౌస్‌లో డ్రై రన్ ఉండదు. నేరుగా ఈ పంపుహౌస్‌లో శుక్రవారం మోటర్ల వెట్న్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఉమ్మ డి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు పంపుహౌస్‌లో డ్రై రన్ లేకుండా 30 మెగావాట్ల మోటార్ల వెట్న్ జరిగిం ది. తెల ంగాణ రాష్ట్రంలో డ్రై రన్ లేకుండా నేరుగా 30 మెగావాట్ల మోటా ర్ల వెట్న్ జరగడం కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గరే మొదటిసారి. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు లో... అది కూడా కన్నెపల్లి పంపుహౌస్‌లో డ్రై రన్ లేకుండా నేరుగా 40 మెగావాట్ల మోటార్ల వెట్న్ జరుగనుంది. ఆండ్రిజ్ కంపెనీ తొలిసారి కన్నెపల్లి పంపు హౌస్‌లో 40 మెగావాట్ల మోటార్ల వెట్న్ నిర్వహిస్తున్నది.

కన్నెపల్లి నుంచే ఎత్తిపోత ప్రారంభం..
తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని పంపుహౌస్‌ల్లో కన్నెపల్లి పంపుహౌస్‌కు ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచే ఈ ప్రాజెక్టులో గోదావరి జలాల ఎత్తిపోత మొదలుకానుంది. జీవనది ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత దిగువన మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద తెలంగాణ ప్రభుత్వం బ్యారేజీ నిర్మించింది. 16.17 టీఎంసీల నీరు నిల్వ చేసేందుకు మేడిగడ్డ బ్యారేజీ సిద్ధమైంది. 1.63 కిలోమీటర్ల పొడవు గల ఈ బ్యారేజీకి మొత్తం 85 గేట్లు బిగించారు. ప్రాణహిత, గోదావరి నుంచి వచ్చే నీరు మేడిగడ్డ బ్యారేజీలో నిల్వ కానుంది. బ్యాక్‌వాటర్ గోదావరిలో 38 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ నీటిని ఎత్తిపోతతో తరలించేందుకు ప్రభుత్వం బ్యారేజీ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లి వద్ద పంపుహౌస్ నిర్మించింది.

ప్రతీ సంవత్సరం 180 టీఎంసీల గోదావరి జలాలు ఎత్తిపోసేలా ఈ పంపుహౌస్ డిజైన్ జరిగింది. ప్రతీ రోజు 3 టీఎంసీల నీటి ఎత్తిపోతకు ఈ పంపుహౌస్‌లో మొత్తం 40 మెగావాట్ల సామర్థ్ధ్యంతో కూడిన 17 మోటార్లు అమర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 17 మోటార్లు బిగించేందుకు ఇప్పటికే పంపుహౌస్‌లో సివిల్ పనులు పూర్తయ్యాయి. అ యితే తొలి విడత జూలై నెల నుంచి ప్రతీ రో జు రెండు టీఎంసీల గోదావరి జలాల ఎత్తిపోతకు కన్నెపల్లి పంపుహౌస్‌లో పదకొండు మోటార్లు పని చేయనున్నాయి. వీటిలో ఇప్పటికే తొమ్మిది మోటా ర్ల బిగింపు ప నులు పూర్తి కా గా మరో రెం డు మోటార్ల బిగింపు పను లు ప్రోగ్రెస్‌లో ఉ న్నాయి. త్వరలోనే ఈ రెండు మోటార్ల బిగింపు పనులు కూడా పూర్తి చేసి జూలై నుంచి పదకొండు మోటార్లతో ప్రతీ రోజు మేడిగడ్డ బ్యారేజీ నుంచి కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా రెండు టీఎంసీల గోదావరి జలాలను తరలించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

నాలుగు దేశాల నుంచి మోటార్లు..
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పంపుహౌస్‌ల్లో బిగిస్తున్న మోటార్లు నాలు గు దేశాల నుం చి ఇక్కడకు వచ్చాయి. ఈ మోటార్ల విడి భాగాలైన రోటర్, స్టార్టర్, ఇన్‌పెల్లర్.. ఫిన్‌లాం డ్, ఆస్ట్రియా, జర్మనీ దేశాల నుంచి.., స్పైరల్స్, హెచ్‌వోపీడీ, ఈవోపీడీ వాల్స్ చైనా దేశం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు చేరాయి. వేర్వేరుగా వివిధ మార్గాల్లో వచ్చిన విడి భాగాలతో ప్రాజెక్టు పంపుహౌస్‌ల్లో ఇంజినీర్లు మోటార్లు రెడీ చేస్తున్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో ఇప్పటికే బిగించిన తొమ్మిది మోటార్లు, ప్రోగ్రెస్‌లో ఉన్న రెండు మోటార్లతో పాటు బిగించాల్సి ఉన్న ఆరు మోటార్ల విడి భాగాలు కూడా నాలుగు దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నాయి. భారీ యంత్రాల సాయంతో ఇంజినీర్లు ఈ పంపుహౌస్‌లో ఒక ఉద్యమంలా మోటార్ల బిగింపు పనులు చేస్తున్నారు.

పంపుహౌస్‌లో స్టార్టిక్ హెడ్ నుంచి 74 మీటర్ల ఎత్తున ఈ మోటర్లు బిగించడం జరుగుతుంది. కన్నెపల్లి పంపుహౌస్‌లో 74 నుంచి 84 మీటర్ల మధ్య బిగించిన 40 మెగావాట్ల మోటార్లు సమీపంలోని డెలివరీ సిస్టర్న్ వద్ద 129 మీటర్ల ఎత్తున గోదావరి జలాలను ఎత్తిపోస్తాయి. మోర్ల నిర్వహణకు పంపుహౌస్ ఫస్ట్ ఫ్లోర్‌లో కంట్రోల్ రూం, సెకండ్ ఫ్లోర్‌లో హైటెన్షన్ రూం, థర్డ్ ఫ్లోర్‌లో లో టెన్షన్ రూం సిద్ధం చేశారు. స్కాడా సిస్టంతో ఈ పంపుహౌస్‌లో ఇంజినీర్లు మోటర్లను నిర్వహిస్తారు. కన్నెపల్లి పంపుహౌస్ వద్ద గోదావరి బెడ్ లెవల్ 90 మీటర్లు. గోదావరి నీటి మట్టం 94 మీటర్లు ఉన్నప్పుడు నీరు పంపుహౌస్‌లోకి చేరనుంది. గోదావరి నది నుంచి పంపుహౌస్ నిడివి 800 మీటర్లు. ఇందులో అప్రోచ్ కెనాల్ పొడవు 350 మీటర్లు, వెడల్పు 175 మీటర్లు. హెడ్ రెగ్యులేటర్ తర్వాత ఫోర్‌బే ఉంది. దీని పొడవు 250 మీటర్లు, వెడల్పు 330 మీటర్లు. ఫోర్‌బే నీటి నిల్వ సామర్థ్ధ్యం పాయింట్ 2 టీఎంసీలు. 360 మీటర్ల పొడవు, 58 మీటర్ల వెడల్పుతో పంపుహౌస్ నిర్మాణం జరిగింది. ఎక్కువ సంఖ్యలో మోటార్లు ఉండే అతిపెద్ద పంపుహౌస్ కూడా ఇదే.

166
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles