రేపు కేఎంసీలో యోగా దినోత్సవం


Thu,June 20, 2019 03:36 AM

పోచమ్మమైదాన్, జూన్ 19: అంతర్జాతీయ యో గా దినోత్సవం సందర్భంగా వరంగల్ కాకతీయ మె డికల్ కళాశాలలో 21న యోగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సీటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి తెలిపారు. కేఎంసీలో బుధవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళోజీ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సం దర్భంగా శుక్రవారం ఉదయం 6:30 గంటలకు కే ఎంసీ గ్రౌండ్‌లో వాకర్స్, మెడికల్ విద్యార్థులతో యోగా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. వీ సీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి రిజిస్ట్రార్ డాక్టర్ దేవులపల్లి ప్రవీణ్‌కుమార్ నూతన యోగా బుక్‌లను ఆవిష్కరిస్తారని వివరించారు. అలాగే 9:30 గంటలకు స్థానిక ఎన్‌ఆర్‌ఐ భవనంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ దేశానికి చెందిన హార్ట్‌ఫుల్‌నె స్ సంస్థ సభ్యుడు స్టాన్ పాల్గొంటారని ఆయన పే ర్కొన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ రామానుజం, డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, సాంబమూర్తి పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...