ప్రవీణ్ గతం నేరమయం


Thu,June 20, 2019 03:35 AM

-గతంలో మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన
-పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకొలేందంటున్న స్థానికులు
-నిందితుని చేష్టలతో భయాందోనతో గడిపిన మహిళలు
వరంగల్‌క్రైం/శాయంపేట : టైలర్స్ స్ట్రీట్ ఘటనకు పాల్పడిన నిందితుడు పోలెపాక ప్రవీణ్‌ది శాయంపేట మండలం వసంతాపూర్ గ్రామం. ఈ విషయం గ్రామానికి తెలియడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నిందితుడి గత చరిత్ర కూడా నేరమయంగా ఉంది. ప్రవీణ్ గత చరిత్రపై పోలీసులను ఆరా తీయగా వాస్తవానికి ప్రవీణ్ కుటుంబం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ అని ఎస్సై రాజబాబు తెలిపారు. ప్రవీణ్ అమ్మమ్మ వసంతాపూర్ గ్రామమని ఇక్కడికి వచ్చి ఉన్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన పోలెపాక రాములు, సూరమ్మ దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. వీరిలో రెండోవాడు ప్రవీణ్ అని చెప్పారు. రాములు గ్రామంలో నీరటిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలో హన్మకొండ నక్కలగుట్ట నీటిపారుదల ఆఫీసులో పదేళ్ల క్రితం రాములు పనిచేసి మరణించడంతో అతడి భార్య సూరమ్మకు అటెండర్‌గా ఉద్యోగం ఇచ్చినట్లు వివరించారు. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తూ వసంతాపూర్‌లో ఇల్లు ఉండాలని సొంత ఇంటిని నిర్మించుకున్నట్లు పేర్కొన్నారు. ప్రవీణ్ పెద్దగా చదువుకోకపోవడంతో ఎలాంటి పని చేకుండా తిరిగేవాడని తెలిపారు. ఈ నేపథ్యంలో 2014 ఫిబ్రవరి 1న ప్రవీణ్‌పై దొంగతనం కేసు నమోదైనట్లు ఎస్సై చెప్పారు. వసంతాపూర్ పక్కనే ఉన్న గంగిరేణిగూడెం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆమె మెడలోంచి బంగారు గొలుసు అపహరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. కాగా ఆమె కేకలు వేయడంతో స్థానికులు నిందితుడిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో అప్పట్లోనే సెక్షన్ 379 కింద ప్రవీణ్‌పై చోరీయత్నం కేసు నమోదైనట్లు ఎస్సై చెప్పారు. అయితే నాలుగేళ్ల క్రితమే ఇక్కడి నుంచి ప్రవీణ్ కుటుంబం హన్మకొండకు వెళ్లి ఉంటున్నట్లు తెలిపారు.

పోలీసుల నిర్లక్ష్యం..
గతంలో కాలనీలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులకు అప్పగిస్తే సింపుల్‌గా తీసుకొని వదిలేశారని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు. ఇంటి కిటికిలో నుంచి మహిళలను చూస్తూ అసభ్యకరంగా సైగలు చేయడం లాంటి చేస్తూ లైంగిక వేధింపులకు గురిచేసేవాడని వాడని మహిళలు పేర్కొన్నారు. నగ్నంగా తిరగడం, కుమార్‌పెల్లిలోని హనుమాన్ చోరీకి ప్రయత్నించినప్పడు పోలీసుల దృష్టికి తీసుకపోవడం జరిగిందని పేర్కొంటున్నారు. గతంలోనే నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లయితే ఈ రోజు పాప చనిపోయి ఉండేది కాదని కుమార్‌పెల్లి వాసులు చెబుతున్నారు. కాగా పాపను కామంధుడు అత్యాచారం చేసి హత్య చేసిన ప్రాంతం హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండటం విశేషం. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చాలా సింపుల్‌గా తీసుకోని వదిలేసేదని ఆ నిర్లక్ష్య ధో రణితోనే నిందితుడు పాపపై అఘాత్యానికి పాల్పడి హత్య చేశాడని టైలర్ స్ట్రీ ట్‌కు చెందిన మహిళలు ఆరోపిస్తున్నారు.
పొక్సో చట్టం ఏమి చెబుతుంది.

పొక్సో చట్టం ప్రకారం...బాలికలను లైం గికంగా వేధించడం, అశ్లీల చిత్రాలను చూపించడం, అసభ్యకరంగా మా ట్లాడటం, లైంగిక విషయాల పట్ల ప్రేరేపించే విధంగా వ్యహరించే వ్యక్తులను కఠినంగా శిక్షించేందుకు పలు సెక్షన్లకు తీసుకొచ్చింది. లైంగిక నేరాలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం 2012 జూన్ 20న ఫోక్సో చట్టాన్ని తీసుకొచ్చి ఆర్టినెన్స్ జారీ చేసింది. ఫోక్సో చట్టం 3నుంచి ప దేళ్ల వరకు జైలు శిక్ష జరిమాన వేధింపుతో జీవితఖైదీ విధించవచ్చని చెప్తుంది.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...