ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయం


Thu,June 20, 2019 03:35 AM

-ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్
వరంగల్ క్రైం, జూన్19 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం హన్మకొండ లష్కర్‌బజార్‌లోని మర్కజీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జయశంకర్ బడిబాట ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్య, భోజనం, బుక్స్ అందిస్తూ విద్యార్థులకు చేయూతనందిస్తోందన్నారు. త్వరలోనే పదో తరగతి ఫలితాల్లో 10/10 సాధించిన విద్యార్థ్ధుల ఇంటికి డీఈవోతో కలిసి వెళ్లి అభినందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, అధ్యాపకులు అంకితభావంతో పనిచేసి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం పదోతరగతిలో ప్రతిభ చూపిన ఇద్దరు విద్యార్థులు శరత్, అరుణ్‌జ్యోతిని ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో డీఈవో నారాయణరెడ్డి, ఎంఈవో వీరభద్రనాయక్, కార్పొరేటర్ దేవేందర్, హెచ్‌ఎం ఎండీ నూరొద్దీన్, సెక్టోరియల్ అధికారులు, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...