చేపల విక్రయకేంద్రాలపై తూనికలశాఖ దాడులు


Thu,June 20, 2019 03:34 AM

-నాలుగు కేసులు నమోదు
-లీగల్ మెట్రాలజీ అధికారి అనిల్‌కుమార్ వెల్లడి
పోచమ్మమైదాన్, జూన్19: చేపల అమ్మకం సందర్భంగా తూకంలో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి వరంగల్ అర్బన్ తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. ఇప్పటికే హన్మకొండ, వరంగల్ ప్రాంతంలో దాడులు నిర్వహించి ప లు కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా లీగల్ మెట్రాలజీ అధికారి అనిల్‌కుమార్ బుధవారం హసనపర్తి మండల కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టా రు. ఈ సందర్భంగా హసన్‌పర్తి చెరువుతో పాటు చేపల మార్కెట్‌లో సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా చేపల విక్రయదారులు రెండు రకాల బాట్లను వాడుతూ వినియోగదారులను మోసం చేస్తున్నారని గుర్తించారు. కిలో చేపలు అమ్ముతున్నప్పుడు పావుకిలో తక్కువగా ఇవ్వడం, రెండు కిలోలు విక్రయిస్తున్నప్పుడు 600గ్రాములు తక్కువ తూకం ఇస్తున్నట్లు గా గుర్తించామని అర్బన్ లీగల్ మెట్రాలజీ అధికారి అనిల్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నలుగురిపై కేసు లు నమోదు చేశామని ఆయన వివరించారు. ఈ దాడు ల్లో తూనికలు, కొలతల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...