మానవ మృగం కిరాతకం..


Thu,June 20, 2019 03:33 AM

- పసిపాపపై రాక్షసకృత్యం
- లైంగిక దాడి.. హత్య
-అర్ధరాత్రి పాప బంధువులను చూసి పారిపోయేందుకు యత్నం
- దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
- నిందితుడి అరెస్టు, పలు సెక్షన్ల కింద కేసు
వరంగల్ క్రైం,19 : అభం శుభం తెలియని 9 నెలల చిన్నారిపై మృగంలా విరుచుకపడి లైంగికంగా హింసించి అంతటితో ఆగకుండా హత్యచేసి రాక్షసానందం పొందాడు ఓ కామాంధుడు. తల్లిఒడిలో బిల్డింగ్‌పై నిద్రిస్తున్న పసిపాపను అర్ధరాత్రి బంధించి తీసుకెళ్లి చిదిమేశాడు. ఈ సంఘటన హన్మకొండ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కుమార్‌పల్లిలోని టైలర్ స్ట్రీట్ సమీపంలోని నాయీ బ్రాహ్మణవాడలో ఓ తల్లి తన 9 నెలల చిన్నపాప, కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోతున్నది. హన్మకొండలోని ఓ బిర్యానీ సెంటర్లో పనిచేసే వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం వసంతపూర్ గ్రామానికి పోలెపాక ప్రవీణ్ అదే ప్రాంతంలో నివసిస్తు న్నాడు. కాగా అర్ధరాత్రి 1.30 సమయంలో బిల్డింగ్ పైకి వెళ్లి రెండు సెల్ ఫోన్లను చోరీ చేయడంతో పాటు తల్లిపక్కకు నిద్రిస్తున్న 9 నెలల చిన్నారి శ్రీహితను అక్కడి నుంచి ఎత్తుకెళ్లాడు.

పక్కకు పాపలేదనే విషయాన్ని గమనించిన పాప తల్లి సోదరుడికి చెప్పడంతో స్థానికులతో సాయంతో ఇంటి సమీపంలోని నీటి గుంతలు, పొదలు, పరిసర ప్రాంతాలను వెతకడం ప్రారంభించాడు. బాధితుల ఇంటి వెనుక గల్లిలో 2.30 సమయంలో బొమ్మలవేప చెట్టు వద్ద నిందితుడు పసిపాపను టవల్‌లో చుట్టుకొని భుజంపై వేసుకొని వస్తూ పాపమేనమామ భరత్, మరికొంత మంది యువకులకు కనిపించాడు. వీరిని గమనించిన నిందితుడు పాపను నేలకుకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించగా యువకులు నిందితుడినకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అప్పటికే పాప తీవ్రరక్త స్రావంతో అచేతన స్థితి లోకి వెళ్లిపోవడంతో దగ్గర్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా మృతి చెందినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. కాగా నిందితుడిని ఉరితీయాలని బాధితులు పెద్ద ఎత్తున హన్మకొండ అశోక జంక్షన్ వద్ద ఆందోళన చేపట్టారు. పాప మృతదేహం తో హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి న్యాయం చే యాలని బైఠాయించారు. సెంట్రల్ జోన్ డీసీపీ నరసింహ ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడికి శిక్షపడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి వెళ్లిపోయారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...