పశుపోషణతో రైతులకు అదనపు ప్రయోజనం


Wed,June 19, 2019 02:25 AM

రాయపర్తి, జూన్ 18: రైతులు పంటల సాగుతోపాటు పశు పోషణను అలవర్చుకున్నట్లయితే అదనపు ప్రయోజనాలు చేకూరుతాయని రాష్ట్ర పశు వైద్యశాఖ అదనపు సంచాలకుడు డాక్టర్. ఎస్ రాంచందర్‌నాయక్ సూచించారు. రాష్ట్ర పశు వైద్యశాఖ ఆధ్వర్యంలోజీవాలకు నట్టల నివారణ మందు కార్యక్రమాన్ని మంగళవారం మండలంలో గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని తిర్మలాయపల్లి, గన్నారం, కొండాపురం గ్రామాల్లో పశు వైద్యాధికారులు శృతి, సోమశేఖర్‌ల ఆధ్వర్యంలో పశు వైద్య సిబ్బంది గ్రామాల్లోని మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందు వేశారు. ఈ కార్యక్రమాలను సందర్శించిన అనంతరం రాంచందర్‌నాయక్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో జీవాలకు వచ్చే వ్యాధులపై పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతేగాక ఈజీఎస్, వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌ల ఆధ్వర్యంలో కల్పిస్తున్న పశువుల పాకల నిర్మాణాలను అన్ని గ్రామాల్లోని రైతులు స ద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గజవెళ్లి అనంతప్రసాద్, భాస్కర్, కోదాటి దయాకర్‌రావు, వరంగల్ అర్బన్ ఏడీ శ్రీనివాస్, గొర్ల కాపర్ల సంఘం అధ్యక్షుడు యాకయ్య, రాము, అమరావతి, మక్బూల్, గణేశ్ పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...