నెలాఖరు వరకు భూసమస్యలు పరిష్కారం


Wed,June 19, 2019 02:25 AM

ఖానాపురం, జూన్18 : క్లియర్ భూముల సమస్యలను జూన్ నెలాఖరు నాటికి వందశాతం పరిష్కరిస్తామని జేసీ రావుల మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఖానాపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం పెండింగ్ భూముల సమస్యలపై రెవెన్యూ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఖర్చు లేకుండా పట్టాపాస్ పుస్తకాలను అందించేందుకు భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిందన్నారు. మొద ట్లో ఎల్‌ఆర్‌ఈపీ ద్వారా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామని, ఇటీవల ధరణి వెబ్‌సైట్ ద్వారా చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో క్లియర్‌గా ఉన్న పార్ట్-ఎ లోని ఖాతాలను 95 శాతం పూర్తిచేశామన్నారు. పీవోటీ, కోర్టు కేసులు, వివాదస్పద భూములను పార్ట్ బీలో చేర్చినట్లు తెలిపారు. పార్ట్ ఎ ఖాతాలతో పాటు పార్ట్ బీ ఖాతాలను సైతం క్లియర్ చేస్తున్నామన్నారు. అసైన్డ్ భూములును కొనుగోలు చేసి, ఇతరులకు విక్రయించిన వాటిలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటేనే ప్రస్తుతానికి పట్టాపాస్ పుస్తకం ఇస్తున్నామని చెప్పారు. 5 కిలోమీటర్ల దూరం జీవోను ప్రభుత్వం 2 కిలోమీటర్లకు తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పట్టాపాస్ పుస్తకాల్లో తప్పులు ఉన్నవారికి పాస్‌బుక్‌లు అంద డం లేదని, ఈ మేరకు రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని జేసీ తెలిపారు. త్వరలోనే సమస్యలన్పింటినీ క్లియర్ చేసి అందరికీ పట్టాపాస్ పుస్తకాలను అందజేస్తామని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ ముంతాజ్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, ఆర్‌ఐ సాయి, వీర్వోలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...