కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ భేష్..


Tue,June 18, 2019 02:37 AM

పోచమ్మమైదాన్, జూన్ 17: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పేదింటి ఆడపడుచుల కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వరంగల్ తహసీల్ కార్యాలయంలో సోమవారం పరిశీలించారు. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రీసోర్స్ ఓఎస్‌డీ మిత్లేష్ గార్గ్ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పలు పథకాల గురించి నయాబ్ తహసీల్దార్ ఎండీ రియాజోద్దీన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారు, లబ్దిదారులకు ఎలా చేస్తున్నారు, విధి విధానాలు ఎలా ఉన్నాయో క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని నోట్ చేసుకున్నారు. ఈ స్కీంతో పాటు కేసీఆర్ కిట్స్, గొర్రెల పంపిణీ, మిషన్ భగీరథ తదితర పథకాల తీరును పరిశీలించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న హృదయ్, స్మార్ట్ సిటీ, నేషనల్ రూరల్ హెల్త్ మిషిన్, ఉజ్వల యోజన ఇతర పథకాలపై కూడా ఆరా తీశారు. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం చాలా భాగుందని, దీనిని దేశ వ్యాప్తంగా అమలు చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిప్రాదనలు అందిస్తామని అధికారిణి గార్గ్ పేర్కొన్నారు. ఈ పథకం దేశంలోనే ప్రత్యేకంగా ఉంటూ మోడల్‌గా తయారవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వీరితో పాటు ఆర్‌ఐ స్వాతి, జూనియర్ అసిస్టెంట్ అయేషా సిద్దిఖి పాల్గొన్నారు. కాగా బృందంలోని అధికారులు ఈ నెల 10 నుండి 31 వరకు అర్బన్ జిల్లా వ్యాప్తంగా మండలాల్లో పర్యటించి, తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పరిశీలించనున్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...