అక్షరాభ్యాసానికి ఆలయంగా శంకరమఠం


Tue,June 18, 2019 02:36 AM

పోచమ్మమైదాన్, జూన్ 17: వరంగల్ శ్రీనివాస కాలనీలోని శ్రీ శృంగేరి శంకరమఠం అక్షరాభ్యాసానికి ఆలయంగా మారుతుంది. తొలుత చిన్నారుల అక్షరాభ్యాసాలకు శ్రీ శారదాంబ మాత సన్నిధి రోజు రోజుకు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దూరాన ఉన్న బాసర, శృంగేరికి వెళ్లలేని వారు తమ పిల్లల చదువు, సంధ్యలు చక్కగా సాగేందుకు శారదాంబ మాత వద్దకు తరలివస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు చేస్తే భవిష్యత్తులో తమ పిల్లలు ఉన్నతస్థానానికి చేరుకుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో శంకరమఠానికి చిన్నారుల అక్షరాభ్యాసానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడం విశేషం. ప్రధాన ఆలయాలైన బాసర, శృంగేరి శంకరమఠంలో మాదిరిగా శాస్ర్తోక్తంగా పూజలు చేస్తుండటంతో దాదాపు ప్రతిరోజు తల్లిదండ్రులు పిల్లల తీసుకుని రావడం జరుగుతుంది. ముఖ్యంగా పాఠశాల ప్రారంభం రోజుల్లో భక్తుల సంఖ్య కంటే చిన్నారుల సంఖ్య క్రమ క్రమంగా పెరగడం గమనార్హం.తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్‌లో ప్రత్యేకంగా శ్రీ శృంగేరి శంకరమఠాన్ని ఏర్పాటు చేశారు.

ప్రధాన ఆలయమైన శ్రీ శృంగేరి ప్రతినిధుల సలహాలు, సూచనల ప్రకారమే ఇక్కడ పూజలు, ఇత్యాధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి ప్రతిష్టించిన శ్రీ శారదాంబ అమ్మవారితో పాటు శక్తి గణపతి, శివలింగం, ఆదిగురు శంకరాచార్యుల విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కోరుకున్న కోరికలు అమ్మవారు తీర్చుతారనే విశ్వాసం భక్తుల్లో నెలకొంది. అమ్మవారి చల్లని చూపు పడితే ఎలాంటి ఇబ్బందులైన అట్లే తొలగిపోతాయనే నమ్మకంతో భక్తులు భక్తిశ్రద్దలతో పూజలు చేస్తుంటారు. ప్రతినిత్యం జరిగే పూజా కార్యక్రమాల్లో వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో కొంతమంది భక్తులు మందుకు వచ్చి 30 కిలోల వెండితో వెండి మండపం తయారు చేయించారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...