మామునూరులో మంత్రి ఎర్రబెల్లి


Tue,June 18, 2019 02:36 AM

వరంగల్, నమస్తేతెలంగాణ: పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించాలనే సంక్పలంతో సీఎం కేసీఆర్ ప్రతీ నియోజకవర్గానికో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన మహాత్మా జ్యోతిభా పూలే బాలుర బీసీ గురుకుల పాఠశాలను నగరంలోని ఆరో డివిజన్ మామునూరులో సోమవారం తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి మంత్రి దయాకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని, విద్యా రంగంలోనూ రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలుపుతున్నారన్నారు. పేద విద్యార్థులకు చదువు భారం కాకూడదనే ఒకే సారి ఇన్ని గురుకులాలను ప్రారంభిస్తున్నట్లు దయాకర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జే అంజిరెడ్డి, పాఠశాల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...