సర్కార్ బడుల్లోనే నాణ్యమైన విద్య


Tue,June 18, 2019 02:36 AM

కాజీపేట, జూన్ 17: శిక్షణ పొందిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే సర్కార్ బడుల్లోనే పిల్లలకు నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కాజీపేట పట్టణం సోమిడి శివారులో మహాత్మ జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన సోమవారం ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంకు వెంకట ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందకు ఉచిత నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం, దుస్తులు అందజేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ కృషితో సోమిడిలో బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటైందన్నారు. ప్రస్తుతం పాఠశాలలో 5,6,7 తరగతులను ప్రారంభించామని, ఒక్కో తరగతిలో 80 మంది విద్యార్థినులకు ప్రవేశాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో డీబీసీ డీవో వసంత, ఎంఈవో వీరభద్ర నాయక్, స్పెషల్ ఆఫీసర్ రాజయ్య, 53,52 వ డివిజన్‌ల కార్పొరేటర్లు మౌనిక చరణ్‌రెడ్డి, జక్కుల రమా రవీందర్‌యాదవ్, వార్డెన్ శంకరయ్య, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...