ఎమ్మెల్యే పెద్ది కుమార్తెకు నామకరణ మహోత్సవం


Mon,June 17, 2019 03:30 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుమార్తె నామకరణ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం తన కుమార్తెకు నామకరణంతో పాటు, చెవులు కుట్టించే వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గంలోని పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి, స్వప్న దంపతులతో పాటు, ఎమ్మెల్యే తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, రాజ్యసభ సభ్యుడు బండాప్రకాశ్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, హైదరాబాద్ మహానగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎస్టీ,ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...