ముందుచూపేది,,?


Sun,June 16, 2019 03:34 AM

పోచమ్మమైదాన్‌, జూన్‌ 15: వరంగల్‌ దేశాయిపేటకు నూతనంగా వేసిన తారు రోడుపై అప్పుడే తవ్వకాలు మొద లుపెట్టారు. తాగునీటికి సంబంధించిన గేట్‌వాల్వ్‌ను అమర్చకుండా రోడ్డు పనులు పూర్తి చేశారు. తీరా నెలరోజుల గ డువక ముందే నీటి సరఫరా సరిగా లేదంటూ ప్రజలు ఆం దోళన చేయడంతో గత్యంతరం లేక కొత్త రోడ్డును తవ్వి మ రమ్మతు పనులు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే... వరంగల్‌ ఆటోనగర్‌ 80 ఫీట్ల రోడ్డు నుండి దేశాయిపేట వరకు కోట్లాది రూపాయల వ్యయంతో తారు రోడ్డు నిర్మా ణం దశలవారీగా పూర్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ శనివారం ఫిల్టర్‌ బెడ్‌ సమీపాన ఉన్న రోడ్డును కూలీలతో తవ్వించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. క నీసం నెల రోజులు కూడా కాకముందే రోడ్డును తవ్వడం ఏమిటంటూ ప్రశ్నించారు. స్థానికుల ప్రశ్నలకు కూలీలు స మాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

అధికారుల సమన్వయలోపం..?
అధికారులు, కాంట్రాక్టర్‌ మధ్య సమన్వయ లోపం వల్ల కొత్త రోడ్డును తొవ్వే పరిస్థితులు తీసుకవచ్చారని స్థానికులు విమర్శిస్తున్నారు. నీటి కొరత పేరుతో రహదారి మరమ్మతు చేసే దుస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. గతంలో పైప్‌లైన్‌ ద్వారా పోచమ్మమైదాన్‌తోపాటు బ్యాంకుకాలనీ, తుమ్మలకుంట, డాక్టర్‌కాలనీ, మంగలికుంట, గౌతమీనగర్‌ ప్రాం తాలకు నల్లాలకు నీటిని సరఫరా చేశారు. అయితే ఒకే పైపులైన్‌ ద్వారా నీరు సరఫరా కాకపోవడంతో తాగునీటి కొ రత ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్ర జల నుంచి నిరసన రావడంతో నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా గేట్‌వాల్వ్‌ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకోవడంతో రోడ్డుపై తొవ్వకాలకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. నీటి సరఫరా కోసం ఇలాంటి ఏర్పా ట్లు చేయడం సబబే అయినప్పటికీ రోడ్డు వేసేటప్పుడే ఈ పని చేస్తే కొత్త రోడ్డు ధ్వసంకాకుండా ఉండేదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారులు ముందుచూపు లేకుండా పనులు చేయిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నా యి. కాగా ఈ పనులు స్థానిక కార్పొరేటర్‌ ఇల్లు, పార్టీ కా ర్యాలయం ఎదురుగానే జరుగుతుండటం గమనార్హం. ఇ ప్పటికే ఫిల్టర్‌బెడ్‌ నుండి లక్ష్మిగార్డెన్‌ వరకు చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణంలో నల్లాపైపు లైన్‌లు పగులుతున్నాయని స్థానికులు ఆందోళనతో ఉన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...