అక్రిడిటేషన్‌ కార్డుల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు


Sun,June 16, 2019 03:34 AM

-కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
న్యూశాయంపేట, జూన్‌ 15: 2019-20 సంవత్సరానికి కొత్తగా మీడియా అక్రిడిటేషన్‌ కార్డుల మంజూరు కోం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ చైర్మన్‌, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఒక ప్రకటనలో కోరారు. గతంలో 2018 డిసెంబర్‌ 31 వరకు జారీ చేసిన అక్రిడిటేషన్ల కాలపరిమితి ని 2019 జూన్‌ 30 వరకు పొడిగించినట్లు తెలిపారు. 2019 జూలై 1 నుంచి 2020 డిసెంబర్‌ 31 వరకు వర్తించే విధంగా కొత్త అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. 2017-18లో నియమించిన జిల్లాస్థాయి మీడియా అక్రిడిటేషన్‌ కమిటీనే యధాతథంగా కొనసాగుతుందని తెలిపారు. అయితే దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలని మీడియా ప్రతినిధుల కు సూచించారు. ఆయా దినపత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, కేబుల్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌ల అర్హత మేరకు లెటర్‌హెడ్‌ ద్వారా మీడియా ప్రతినిధుల పేర్లను పేర్కొంటూ వరంగల్‌ అర్బన్‌ జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ ఉప సంచాలకులు కార్యాలయంలో జూన్‌ 20లో పు అందజేయాలని తెలిపారు. సంబంధిత జిల్లాస్థాయి, డెస్క్‌ జర్నలిస్టులు, నియోజకవర్గం, మండలస్థాయి జర్నలిస్టులు http:/ipr.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా జూ న్‌ 24లోగా దరఖాస్తు చేయాలని సూచించారు. ఆన్‌లైన్‌లో పొందుపరిచిన అక్రిడిటేషన్‌ నిబంధనలు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 239 ని పూర్తిగా చదివి దరఖాస్తులోని అన్ని కాలములను తప్పనిసరిగా భర్తీ చేసి పంపాలని తెలిపారు. మాండేటరీగా పేర్కొన్న విద్యార్హత, అనుభవం, అక్రిడిటేషన్‌, తదితర ప్రతులను స్కాన్‌ చేసి దరఖాస్తు లో పేర్కొన్న కాలంలో అటాచ్‌ చేయాలని సూచించారు. 18 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను పంపవచ్చునని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...