మున్సిపాలిటీ అభివృద్ధి పనులను ప్రారంభించాలి


Sun,June 16, 2019 03:33 AM

వర్ధన్నపేట, నమస్తే తెలగాణ, జూన్‌ 15 : నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరితను ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ కోరారు. శనివారం సాయంత్రం కలెక్టర్‌ను వరంగల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కలిసి వర్ధన్నపేటలో చేపట్టనున్న పనులపై సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వం గతేడాది వర్ధన్నపేట పట్టణం, విలీనంగా ఉన్న తండా పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు రూ.20 కోట్లను మంజూరు చేసింది. ఇంతకాలం ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎలాంటి పనులను చేపట్టడానికి వీలుకాలేదు. ఎన్నికల కోడ్‌ ముగిసినందున శనివారం కలెక్టర్‌ హరితను కలిసి రూ.20 కోట్ల పనులకు సంబంధించిన ప్రణాళిక, పనుల గుర్తింపు చేపట్టిన విషయాలను వివరించారు. వెంటనే పనులకు సంబంధించిన టెండర్‌ల ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ విషయాలపై కలెక్టర్‌ స్పందించి త్వరలోనే టెండర్‌లు పూర్తి చేయించి పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...