ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య


Sun,June 16, 2019 03:32 AM

కాజీపేట, జూన్‌ 17: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తోందని పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. కాజీపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు మామిడాల రాజేంద్రం అధ్యక్షతన బడిబాట కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పట్టణంలోని జూబ్లీ మార్కెట్‌, తిలక్‌నగర్‌, వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్‌ పుర వీధుల గుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ పట్టణంలో ఆటో కార్మికుడి కూతురు మేఘమాలను బడిబాట కార్యక్రమంలో పదో తరగతిలో చేర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన, శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో విలువలతో కూడిన ఒత్తిడి లేని గుణాత్మక విద్య బోధన జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పిల్లలకు పౌష్టికరమైన ఆహారం, ఉచిత పుస్తకాలు, యూనిఫారం, మెరిట్‌ విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ అందిస్తుందని తెలిపారు.

పాఠశాలలో మౌలిక వసతులతో పాటుగా విశాల వాతావరణం ఉంటుందన్నారు. ప్రభుత్వం పాఠశాలకు ఇటీవల క్రీడా మైదానం కోసం మంజూరు చేసిన స్థలాలకు త్వరలోనే ప్రహరీలను నిర్మిస్తామన్నారు. పాఠశాలకు చెందిన ప్రహరీని కూల్చిన వ్యక్తులు తిరిగి గోడ నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకునేలా చూడాలని తహసీల్దార్‌ బండి నాగేశ్వర్‌రావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో వీరభద్రునాయక్‌, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, ఆర్టీఏ సభ్యుడు కాటాపురం రాజు, రైతు సమన్వయ కమిటీ సభ్యుడు సుంచు కృష్ణ, టీఆర్‌ఎస్‌ నాయకులు శిరుమల్ల దశరథం, మహ్మద్‌ సోని, తేలు సారంగపాణి, మహమూద్‌, వినయ్‌, అశోక్‌, కోల వినోద, సరోజన దేవి, సర్వర్‌ తదితరులతో పాటుగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జ్ఞానేశ్వర్‌, ఉపాధ్యాయులు అప్సర్‌, ఆదిరెడ్డి, నర్సింహరావు, అశోక్‌, శైలజ, సత్య, శ్రీలత, శ్రీలత, జ్యోతి కుమారి, ప్రవీణజ్యోతి, రాణి తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...