సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి: సీపీ


Sat,June 15, 2019 02:34 AM

వరంగల్ క్రైం: లక్ష్యసాధనలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ధైర్యంతో ముందకు సాగాలని వరంగల్ పొలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ పేర్కొన్నారు. ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బంది పిల్లలను శుక్రవారం భీమారంలోని శుభం ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సీపీ రవీందర్ మాట్లాడుతూ పిల్లలు చదువుల్లో రాణించేందుకు సమయాన్ని కేటాయించి ప్రోత్సహిస్తున్న పోలీస్ సిబ్బందిని, కుటుంబాలను అభినందించారు. చదువుల్లో రాణించినట్లే జీవితంలో రాణించి వ్యక్తిగత ప్రేరణలో ముందుకు వెళ్లాలని వివరించారు. పోలీస్ ఉద్యోగం చేసే సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ, ఉద్యోగ ధర్మాన్ని పాటించడం, కుటుంబ సభ్యుల సంక్షేమం, జీతాన్ని ప్రణాళికబద్ధంగా వినియోగం లాంటి నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు నాగరాజు, నరసింహ, ఏసీపీలు శ్రీధర్, సదానందం, శ్రీనివాస్, ఆర్‌ఐ శ్రీనివాస్‌రావు, సతీశ్, ఇన్‌స్పెక్టర్ సంపత్‌రావు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్ పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...