అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేస్తాం


Sat,June 15, 2019 02:33 AM

ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్
న్యూశాయంపేట,జూన్14: నియోజకవర్గంలో అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరుస ఎన్నిల కోడ్ నేపథ్యంలో నియోజక వర్గంలో కొంత అభివృద్ధి పనులకు అటంకం కలిగిందన్నారు. నిధులు ఉన్నప్పటికీ పనులు చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసినందున ఇక నుంచి అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతామని అన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలైన విద్యా, వైద్యంపై ఐదేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నిధులు కేటాయించిందన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నానన్నారు. నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. కాజీపేట ఆర్వోబీ నిర్మాణానికి అన్ని డిపార్టుమెంట్లను సమన్వయపర్చి త్వరలో పనులు ప్రాంభిస్తామని తెలిపారు. అంబేద్కర్ నగర్, సాయినగర్‌లో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నేరవేరుస్తానని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు ఉనికి కోసమే సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరెటర్లు మాడిశెట్టి అరుణ, వేముల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి జనార్దన్‌గౌడ్, డాక్టర్ పుల్లా శ్రీనివాస్, రజనీకాంత్, ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు మోహన్‌రావు, కృష్ణ, చాగంటి రమేశ్ పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...