ముంపుపై నాలాల పూడికతీత పనులు షురూ


Thu,June 13, 2019 04:05 AM

-ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల సమన్వయం
వరంగల్, నమస్తే తెలంగాణ : వర్షకాలం వస్తున్న నేపథ్యంలో ముంపు ముప్పు తప్పించేందుకు బల్దియా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రేటర్ పరిధిలోని ప్రధాన నాళాలతో పాటు పెద్ద బాక్స్ డ్రైనేజీల పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. బల్దియా ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాలు సమన్వయంతో నాలాల పూడికతీత పనులను చేపడుతున్నాయి. నాలాల పూడికతీత పనులకు రూ. 20 లక్షలు కేటాయించారు. నగరంలోని ప్రధాన నాలాల్లో పూడిక తీత పనులు ఇప్పటికే మొదలు పెట్టారు. ఒక వైపు ఇంజినీరింగ్ అధికారులు ప్రధాన నాలాల పూడికతీత పనులు చేస్తుండగా మరో వైపు ప్రజారోగ్య విభాగం అధికారులు కచ్చా కాలువలు, చిన్న చిన్న బాక్స్ డ్రైనేజీల పూడికతీత పనులు చేపడుతున్నారు. రెండు రోజులుగా గ్రేటర్ పరిధిలో పూడికతీత పనులు వేగంగా జరుగుతున్నాయి. గత వర్షకాలం సమయంలో నగరం ముంపుకు గురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న బల్దియా అధికారులు ప్రస్తుతం వర్షకాలం వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా ముందు చూపుతో నాలాలు,బాక్స్ డ్రైనేజీల పూడికతీత పనులు చేపట్టడం గమనార్హం.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...