గులాబీ కంచుకోట


Sat,May 25, 2019 03:13 AM

-ఓరుగల్లులో కొనసాగుతున్న టీఆర్‌ఎస్ హవా
-2004 నుంచి విలక్షణ తీర్పు
-సీఎం కేసీఆర్‌కు అండగా ప్రజలు
-ఇప్పుడిక ప్రగతి దారులుపరుగుపెట్టాలి
-అధినేతపైవిశ్వాసం..అభివృద్ధిపై ఆకాంక్ష
వరంగల్ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ: ఉత్తర తెలంగాణ ముఖద్వారం ఓరుగల్లు. గులాబీ విజయతోరణంగా మొదటి నుంచి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూనే ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి దాకా టీఆర్‌ఎస్‌కు నీరాజనాలు పలుకుతూనే తన విశ్వాసాన్ని ప్రకటిస్తూనే ఉంది. ఎన్నికలు ఏవైనా సరే టీఆర్‌ఎస్‌కు బాసటగా నిలుస్తూ వస్తున్నది. ఎత్తుపల్లాలను చదునుచేస్తూ సందర్భం వచ్చిన ప్రతీసారి టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాసటగా నిలుస్తున్నది. తెలంగాణ ఉద్యమానికి సవాళ్లు ఎదురైన ప్రతీసారి ఏ ఉద్యమస్ఫూర్తిని చూపిందో అదే స్ఫూర్తిని రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ప్రదర్శిస్తున్నది. టీఆర్‌ఎస్ అంటే వరంగల్. వరంగల్ అంటే టీఆర్‌ఎస్‌గా వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయ ప్రస్థానంలో సుస్థిర స్థానాన్ని పదిల పర్చుకుంటూనే ఉంది. 2004 సాధారణ ఎన్నికల నుంచి మొన్న వెలువడ్డ 2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల దాకా అదే స్ఫూర్తిని నిలుపుకున్నది. కుట్రకత్తులు ఎన్ని వేలాడినా మొక్కవోని దీక్షతో ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కడుతూనే ఉన్నారు.

అదే క్రమంలో గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లా ప్రగతికి భవిష్యత్‌దర్శనం చేసుకోవడమే కాకుండా ప్రగతి అడుగులు పట్టుతప్పకుండా చేయాలనే తలంపును ప్రదర్శిస్తూనే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో మిగతా రాష్ట్రంలోని మిగితా ఏ జిల్లాలో లేని విధంగా రెండింటికి రెండు పార్లమెంట్ స్థానాలను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టింది. ప్రగతి రథం ఆగిపోవద్దన్న ఒకే ఒక ఆకాంక్షతో ప్రజలు టీఆర్‌ఎస్‌ను నెత్తినపెట్టుకున్నారు. పార్టీపై విధేయత, అధినేతపై విశ్వాసం ప్రదర్శిస్తూ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉన్న టీఆర్‌ఎస్ కార్యర్తలు పట్టుదలతో పనిచేశారు. తమకేం వస్తుంది? వరుస ఎన్నికల్లో అలసిపోకుండా ఎప్పటికప్పుడు ప్రజల్లో పార్టీకి ఉన్న నమ్మకం సడలకూడదనే సంకల్పంతో కష్టపడి పనిచేశారు. అందుకే ఈ అపురూప విజయం సాధించేందుకు దోహదం చేసిందని పార్టీ పెద్దల మనసుల్ని గెలుచుకోగలిగారు.

అసాధారణ విజయ బావుటా...
పార్టీకి రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నా ఉమ్మడి వరంగల్‌లో మాత్రం ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌గా అసాధారణ ఫలితాలు ఇవ్వడంలో ఓరుగల్లు ప్రజలు విలక్షణతను చాటుకుంటూనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కాటకలుస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న సందర్భంలో టీఆర్‌ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సందర్భం నుంచి ఎన్నికల సందర్భం దాకా ప్రతి అడుగులోనూ వరంగల్ గులాబీ కంచుకోట అని నిరూపిస్తూనే ఉంది. 2004, 2008, 2009, 2010, 2012, 2015, 2018, 2019 అవి సాధారణ ఎన్నికలు గానీ, ఉప ఎన్నికలు గానీ ప్రతీ సందర్భంలో టీఆర్‌ఎస్ పార్టీ పట్ల, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల వరంగల్ తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూనే వస్తుంది. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం 2015 వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఇదే పసునూరి దయాకర్ జాతీయ స్థాయిలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీల జాబితాలో చేరారు. రాష్ట్ర ఆవిర్భావ తొలి అడుగులోనే టీఆర్‌ఎస్ పార్టీ వైఫల్యం చెందింది. అభివృద్ధిని పట్టించుకోకుండా ఉంది అని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బహుముఖ దాడి చేసిన సందర్భంలో నాడు ఉద్యమ సమయంలో ఏ స్ఫూర్తినైతే ప్రదర్శించిందో రాష్ట్ర సాధన అనంతరం జరిగిన ఈ ఉప ఎన్నికలో అదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించి టీఆర్‌ఎస్ పార్టీకి నైతిక, భౌతిక బలాన్ని ఇచ్చింది.

ఇదే స్ఫూర్తితో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఆ తరువాత వరంగల్ సహా కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లు సహా మిగతా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సుస్థిర విజయానికి వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక మైలు రాయిగా నిలిచింది. ఆ తరువాత జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండింటికి పది అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో వరంగల్ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాయి. ఇక మొన్న వెలువడిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ వరంగల్, మహబూబాబాద్ ఈ రెండు చోట్లా రాష్ట్రంలో నెలకొన్న అక్కడక్కడా ఎదురైన ప్రతికూల పరిస్థితులను తోసిపుచ్చి వరంగల్ అంటే టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ అంటే వరంగల్లే అని అటు రెండు స్థానాలను భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాష్ట్రంలో గెలిచిన 17 మంది ఎంపీల్లో 3,50,298 మెజార్టీని సాధించి మరోసారి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...