ఇఫ్తార్ విందును విజయవంతం చేయాలి


Sat,May 25, 2019 03:09 AM

కరీమాబాద్, మే 24 : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్‌విందును విజయవంతం చేయాలని ఫోర్టురోడ్డులోని ఈద్గా అధ్యక్షుడు జబ్బార్ కోరారు. శుక్రవారం ఫోర్టురోడ్డులోని ఈద్గా లో అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని దాదాపు 25 మసీదులకు చెందిన అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జబ్బార్ మాట్లాడుతూ జూన్ 2న ఈద్గాలో ఇఫ్తార్‌విందును ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్నారు. ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అందకు మసీదుల అధ్యక్షులు చొరవ చూపాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఈ నెల 30న చీరెల పంపిణీ చేపట్టనుందన్నారు. తమ తమ మసీదు పరిధిలోని పేదల వివరాలను అందజేయాలన్నారు. అడిషనల్ కమిషనర్ నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో మైనారిటీ ఇన్‌చార్జిగా తాను వ్యవహరించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలను ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అండర్‌రైల్వేగేట్ ప్రాంతం మసీదుల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...