మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి


Thu,May 23, 2019 02:21 AM

-గురుకులాలతో పేద ముస్లింలకు మెరుగైన విద్య
-రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
-టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో హన్మకొండలో ఇఫ్తార్ విందు

రెడ్డికాలనీ, మే 22: ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ ప్రజల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. టీఎన్జీవోస్ యూనియన్ వరంగల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కోలా రాజేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో హన్మకొండలోని అమృత గార్డెన్స్‌లో ఇఫ్తార్ వింద్ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథులుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టీఈజాక్ చైర్మన్ పరిటాల సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ పేద ముస్లిం కోసం మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.

అన్ని మతాల పండుగలను గుర్తించి ప్రభుత్వం చేదోడుగా నిలిచిందన్నారు. దేశంలోనే ముస్లింలకు ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. పేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా గిఫ్ట్ ప్యాకెట్స్ అందిస్తున్నారని, ముస్లింలను అక్కున చేర్చుకుంటున్నా రన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముస్లిం సోదరులకు రంజాన్ పవిత్రమాసోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారాన్ని అందిస్తానన్నారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం ఇఫ్తార్ వింద్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. టీఈజాక్ చైర్మన్ పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ ఇఫ్తార్ విందు హిందు ముస్లిం ఐక్యతకు ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు, టీజీవో కోఆర్డినేటర్ జగన్మోహన్‌రావు, రత్నవీరాచార్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో యాకుబ్‌పాషా, పుల్లూరు వేణుగోపాల్, రాజేందర్, రాంకిషన్, అంజాద్‌అలీ, టీజీవో కేంద్ర కార్యదర్శి హసనుద్దీన్, రియాజుద్దీన్, రత్నాకర్‌రెడ్డి, సోమయ్య, రాంకిషన్, కిషన్‌రావు, షఫి, శ్యాంసుందర్, రామునాయక్, శ్రీనివాస్, మా ధవరెడ్డి, ర వి, దాస్యనాయక్, సర్వర్, హుసైన్, ఉస్మాన్‌పాషా పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...