పారదర్శకంగా రంజాన్ కానుకల పంపిణీ


Thu,May 23, 2019 02:20 AM

వరంగల్, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు అందచేస్తున్న కానుకలను పారదర్శకంగా పంపిణీ చేస్తామని బల్దియా అదనపు కమిషనర్ నాగేశ్వర్ అన్నారు. బుధవారం కార్పొరేషన్‌లో తూర్పు నియోజకవర్గ మసీద్ కమిటీ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పేద ముస్లింలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 3వేల గిఫ్ట్ ప్యాకెట్లను పంపించిందని అన్నారు. వీటిని వరంగల్, ఖిలావరంగల్ మండలాల పరిధిలోని పేద ముస్లింలకు పంపిణీ చేస్తామని అన్నారు. వరంగల్ మండలం పరిధిలో 23, ఖిలావరంగల్ పరిధిలో 25 మసీదులను గుర్తించామని, వాటి పరిధిలో పేద ముస్లింలకు కానుకలను పంపిణీ చేస్తామన్నారు. వరంగల్ మండలానికి సంబంధించి సిటీ ప్యాలెస్‌లో, ఖిలావరంగల్ మండలానికి సంబంధించి శంభునిపేటలోని ఆర్‌ఆర్ గార్డెన్, ఇసుక అడ్డా సెంటర్‌లోని రాజశ్రీ గార్డెన్, చింతల్ ప్రాంతాల్లో ఈ నెల 25 నుంచి 27 వరకు కానుకలు పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వం తరుపున దావతే ఇఫ్తార్ విందు వరంగల్ మండలంలో జూన్ 1న, ఖిలావరంగల్ మండలం పరిధిలో జూన్ 2న ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వరంగల్, ఖిలావరంగల్ మండాలలకు 3 మసీదుల చొప్పున ఇఫ్తార్ విందుకు గుర్తించామని అన్నారు. మసీద్‌కు లక్ష రూపాయల చొప్పున ముందస్తుగానే మసీద్ కమిటీల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు.
రంజాన్ కానుకల పంపిణీ, ఇఫ్తార్ విందు సజావుగా జరిగేలా మసీద్ కమిటీలు సహకరించాలని ఆయన కోరారు. ఈ ససమావేశంలో డిప్యూటీ కమిషనర్ గోధుమల రాజు, ఏసీపీ గణపతి, పన్నుల అధికారి శాంతి కుమార్, మసీద్ కమిటీల ప్రతినిధులు జబ్బార్, యాకూబ్ అలీ, చాంద్‌పాషా, అజరుద్దీన్, నహిమొద్దీన్, ఫైజోద్దీన్, హుస్సేన్, షబ్బీర్, మసీయెదీద్దన్, యాసీన్, ఖమర్, సలీం, యూసూఫ్, అబిద్, యాకూబ్, అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...