అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం


Thu,May 23, 2019 02:19 AM

కమలాపూర్: మండలంలోని శనిగరం గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఎదుట 32 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం హాజరయ్యారు. మంత్రి ఈటల రాజేందర్ ఆలయానికి రావడంతో అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ శ్రీఅభయాంజనేయస్వామి 32 అడుగుల విగ్రహ ప్రతిష్ఠాపన హోమంలో ప్రత్యేక పూజలు చేశారు. అంజనేయస్వామి ప్రతిమపై పాలు పోసి స్వామి వారిని మొక్కుకున్నారు. అర్చకులు మంత్రికి తీర్థప్రసాదాలు అందించి మంత్రికి శాలువా కప్పి అంజనేయస్వామి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. ఆలయంలో ఈ రోజు జలాధివాసం, క్షీరాధివాసం, శయ్యాధివాసం కార్యక్రమాలు జరుగుతాయని అర్చకులు తెలిపారు. గురువారం శ్రీ అభయాంజనేయస్వామి విగ్ర ప్రతిష్ఠాపన ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు గోవర్థన పెద్ద కృష్ణమాచార్యులు, రఘురామచార్యులు, సాందీప్‌కుమార్‌చార్యులు, వరదరాజన్ చార్యులు, రామకృష్ణ చార్యులు, వంశీకృష్ణ చార్యులు, కాండూరి శ్యామసుందర చార్యులు, ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...