పవిత్రమాసంలో దానగుణం కలిగివుండాలి


Thu,May 23, 2019 02:19 AM

వరంగల్ చౌరస్తా, మే 22: పవిత్ర రంజాన్‌మాసంలో ప్రతీఒక్కరు దానగుణం కలిగివుండాలని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. 16వ డివిజన్ నిజాంపుర ప్రాంతంలో టీఆర్‌ఎస్ అర్బన్ జిల్లా నాయకులు అబ్ధుల్ ఖాహర్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్‌మాసాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం కుటుంబాల పిల్లలకు బట్టలు, పేద, వితంతు మహిళలకు నిత్యవసర సరుకులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రవక్త చూపిన దారిలో నడుస్తూ ప్రేమ, కరుణ, దయా, దాన గుణాలను ప్రతీఒక్కరు కలిగివుండాలని అన్నారు. రానున్న రోజుల్లో సైతం అబ్దుల్ ఖాహర్ చేతుల మీదుగా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు షబ్బీర్, అలగ్జాండర్, విజయ్, రహీం, అక్బర్ , పాషా, యాకుబ్, సయ్యుద్, మహ్మద్ యాకుబ్ ఆలీ, రషీద్, కొలిపాక శ్రీనాథ్, సాబిర్, జాఫర్, ముక్రం, పోకల చందర్, తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...