చిత్ర కళాప్రదర్శన ప్రారంభం


Thu,May 23, 2019 02:19 AM

న్యూశాయంపేట, మే22: హన్మకొండ నగరంలోని పోచమ్మకుంట తేజస్వీ ఉన్నత పాఠశాల టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ కోర్సు(డ్రాయింగ్) ఛాత్రోపాధ్యాయుల చిత్రకళా ప్రదర్శనను డీఈవో కే నారాయణరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఏడు వందల మంది విద్యార్థులు వేసిననటువంటి సాండ్ ఆర్ట్, క్రాప్ట్ వర్క్స్, వాటర్ పేయింట్స్, సందేశాత్మక చిత్రాలు, పనికిరాని వస్తువులతో వివిధ కళాత్మక రూపాలను ప్రదర్శించారు. అబ్బుర పరిచే చిత్రాలను, కళాకండాలను చూసి ఛాత్రోపాధ్యాయుల సృజనాత్మక శక్తిని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ రెండు విద్యా సంవత్సరాల(డీఎడ్)కోర్సును 42 రోజులకు కూర్పు చేసి వేసవి సెలవుల్లో శిక్షణార్థులకు అనుకులంగా మార్చిన ట్రెయినింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోర్సును సద్వీనియోగం చేసుకోని విద్యార్థులలోని సృజనాత్మక శక్తులకు ప్రొత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు వేణుఅనంద్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...