మార్కెట్ కమిటీ అధికారులపై డైరెక్టర్ గరం గరం


Thu,May 23, 2019 02:18 AM

కాశీబుగ్గ, మే22: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధికారుల పనితీరుపై మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని ఉద్యోగులను హెచ్చరించారు. బుధవారం మార్కెట్ ప్రధాన కార్యాలయంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి క్యారం సంగ య్య అధ్యక్షతన ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ లక్ష్మీబాయి మాట్లాడు తూ.. మార్కెట్ పరిధిలోకి వచ్చే ప్రతీ వ్యవసాయ ఉత్పత్తులను కంప్యూటర్‌లో పూర్తి స్థాయిలో నమోదు చేయాలని అదేశాలు జారీచేశారు. బుధవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌తో పాటు పండ్ల మార్కెట్‌కు వచ్చి న వ్యవసాయ ఉత్పత్తులు పూర్తి స్థాయిలో వీడియోలో రికార్డు చేశారు. కాగా, అధికారులు ఇచ్చిన లిస్టు, వీడి యో రికార్డుల ద్వారా తనిఖీలు చేయగా చాలా వరకు వ్యత్యాసం ఉన్నట్లు తెలిసింది.

దీంతో ఉద్యోగుల పనితీరుపై ఆసంతృప్తి వ్యక్తం చేశారు. పండ్ల మార్కెట్‌లో పూర్తిస్థాయిలో రికార్డులు నమోదు చేయడంలో సంబంధిత సుపర్‌వైజర్‌తో పాటు ఇతర సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి సీజన్‌లో మార్కెట్‌కు వచ్చిన సరుకు వివరాలు నమోదు చేయలేదని వెంటనే రికార్డుల్లో న మోదుచేసి తమకు చూపించాలని అదేశించారు. అలాగే, పండ్ల మార్కెట్‌లో రైతులకు, వ్యాపారులకు తాగునీటి సౌకర్యం కల్పించడంలో సంబంధిత అధికారులు పూర్తి గా విఫలమయ్యారని మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబా యి అన్నారు. మార్కెట్ కమిటీ ఆదాయానికి పండ్ల మా ర్కెట్ అధికారులు గండి కొడుతున్నారని ఇప్పడికైనా ప నితీరు మార్చుకోవాలని బాధ్యులను హెచ్చరించారు. వెంటనే మార్కెట్‌కు వచ్చే అన్ని వ్యవసాయ ఉత్పత్తుల ను నమోదు చేసి జీరో వ్యాపారానికి చెక్‌పెట్టి మార్కెట్ ఆదాయాన్ని పెంచాలని కోరారు. జూన్ 1న మార్కెట్‌కు వచ్చి మళ్లీ తనిఖీలు చేస్తానని అప్పటికీ అధికారులు తమ పనితీరు మార్చుకోకుంటే వెంటనే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి హెచ్చరించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...