పర్యావరణాన్ని పరిరక్షించాలి


Wed,May 22, 2019 02:38 AM

గోవిందరావుపేట, మే 21 : పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని తెలంగాణ టూరిజంశాఖ ఎండీ బోయినపల్లి మనోహర్‌రావు, అటవీశాఖ సీసీఎఫ్ అక్బర్‌లు అన్నారు. మంగళవారం టూరిజంశాఖ, అటవీశాఖల ఆధ్వర్యంలో లక్నవరంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జింకలపార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. లక్నవరంలో ప్లాస్టిక్ నిషేధంపై ఇరుశాఖలు కూడా సమన్వయంతో పనిచేసి ప్లాస్టిక్హ్రిత లక్నవరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అవసరమైతే జింకలపార్కు సమీపంలో చెక్‌పోస్టు ఏర్పాటుచేసి ప్లాస్టిక్‌పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. లక్నవరం సరస్సు త్వరలో రిజర్వాయర్‌కానున్న దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

జింకలపార్కు నుంచి లక్నవరంలోని పార్కింగ్ స్థలం వరకు అటవీప్రాంతంలో మరో రహదారి ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్ పీకే ఝా ఆదేశాల మేరకు ఇరుశాఖల పర్యవేక్షణలో రోడ్డు నిర్మాణానికి సర్వే జరిపి కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు వారు వివరించారు. నూతనంగా రోడ్డు నిర్మాణమైతే పర్యాటకులకు చాలా ఇబ్బందులు తగ్గుతాయని అన్నారు. లక్నవరంలో టూరిజం, అటవీశాఖ ఆధ్వర్యంలో సైక్లింగ్, ట్రెక్కింగ్, సఫారీ షికారు, నైట్‌క్యాంపెయిన్‌లపై మరింత దృష్టి సారించి నూతన హంగులతో మరికొంత అభివృద్ధి పనులు చేపట్టి పర్యాటకులను ఆకట్టుకోవాలని అన్నారు.

అభివృద్ధికి సహకరించాలి..
లక్నవరంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు అటవీశాఖ అధికారులు సహకరించాలని సీసీఎఫ్ అక్బర్‌ను ఎండీ మనోహర్‌రావు కోరారు. నూతనంగా నిర్మాణం చేపడుతున్న రెస్టారెంట్‌తోపాటు లక్నవరంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై అధికారులు సహకరిస్తే లక్నవరం ఎంతో అభివృద్ధి చెంది పర్యాటకులను మరింత ఆకట్టుకుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో లక్నవరం వద్ద కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేసేందుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. మొదటి ఐలాండ్ వద్ద ఉన్న రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్‌ను తొలగించినట్లయితే ఆ ప్రాంతమంతా పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా చిల్డ్రన్ పార్కు, గార్డెన్, మ్యూజియంలు ఏర్పాటు చేసేందుకు త మ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట టూరిజం జనరల్ మేనేజర్ నాథన్, జయశంకర్, ములుగు జిల్లాల డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌శెట్టి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ట్రైనీ ఐఎఫ్‌ఎస్ అధికారి భూక్య లావణ్య, ములుగు ఎఫ్‌డీవో జోగిందర్, ఖాదిరి మొహినుద్దీన్, టూరిజం డీఈలు ఏకాంబరం, రామకృష్ణ, రేంజ్ అధికారులు మాధవీశీతల్, డోలి శంకర్, ఎకోటూరిజం జిల్లా కోఆర్డినేటర్ కల్యాణపు సుమన్ పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...