వనసంపదను కాపాడుకోవాలి


Tue,May 21, 2019 01:24 AM

సుబేదారి, మే 20: వనసంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని కాకతీయ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ సింగరాయాచార్య అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా , జనవిజాన వేదిక, వనసేవా సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం హన్మకొండ సుబేదారి అటవీశాఖ కార్యాలయంలో సెమినార్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ జీవవైవిధ్యానికి ప్రత్యేకత ఉంది, జీవవైవిద్యానికి నెలవైన వన సంపదను కాపాడుకోవాలిసన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టే నేరస్తులకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రజలకు అటవీ సంపద ప్రాముఖ్య, మానవాళి జీవన విధానంలో జీవవైవిధ్యం పెనవేసుకున్న అనుబంధాన్ని తెలియజేయాల్సిన బాధ్యత అటవీశాఖ అధికారులకు ఉందని వివరించారు. జీవజాతుల పరిరక్షణకు ప్రతీ పౌరుడు చొరవ తీసుకోవాలి, అడవులను ప్రామాణిక జాతిగా భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా అటవీశాఖ సంరక్షణాధికారి అక్బర్‌ మాట్లాడుతూ మానవ జీవనం విధానం అనేది వనసంపదతో కూడి ఉన్నది. మానవాళి మనుగడ అనేది అన్ని జాతుల జీవపరిమాణంతో ముడిపడి ఉందని చెప్పారు. బాధ్యతగా వనసంపదను కాపాడుకోవాలని సూచించారు. ప్రొఫెసర్‌ సింగారాయాచార్య పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా జీవవైవిధ్యనేపథ్యాన్ని వివరించారు. సమావేశంలో వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లా అటవీ శాఖ అధికారులు రామలింగం, పురుషోత్తం, రేంజ్‌ ఆఫీసర్స్‌, వనసేవా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...