గ్రామాల్లో జోరుగా ఉపాధి హామీ పనులు


Sat,May 18, 2019 01:51 AM

పర్వతగిరి, మే 17 : మండలంలో ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 వ తేదీ నుంచి మే 17 వ తేదీ వరకు 95 లక్షల 18 వేల రూపాయల ఉపాధి పనులు నిర్వహించారు. గత సంవత్సరంలో 365 రోజులకు మొత్తం కలిసి 2 కోట్ల 9 లక్షల రూపాయల నిధులతో కూలీలు పనులు పూర్తి చేశారు. ఇప్పుడు కేవలం 48 రోజుల్లోనే 4893 మంది ఉపాధి కూలీలు ముమ్మరంగా పనులను చేపట్టారు. కల్లెడలో 357 మంది కూలీలు పనులను చేస్తూ మొదటి స్థ్ధానంలో నిలవగా, ఏనుగల్ గ్రామంలో 308 మంది కూలీలు, చింతనెక్కొండలో 306 మంది కూలీలు పనులను నిర్వహిస్తూ ద్వితీయ, తృతీయ స్థ్ధానంలో ఉన్నారు. రావూర్‌లో 291 మంది, పెద్ద తండాలో 277 మంది, సోమారం గ్రామంలో 261 మంది ఉపాధి పనులు చేస్తున్నారు. చౌటపెల్లిలో 246 మంది, పర్వతగిరిలో 201 మంది దౌలత్‌నగర్‌లో 200 మంది, కొంకపాకలో 191 మంది, వడ్లకొండలో 187 మంది, గోపనపెల్లిలో 128 మంది, నారాయణపురంలో 128 మంది, జమాల్‌పురంలో 121 మంది, అనంతారంలో 106 మంది, బూరుగుమళ్లలో 90 మంది, రోళ్లకల్‌లో 89 మంది ఉపాధి పనులకు వెళ్తున్నారు. అన్నారం, శ్రీనగర్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడంతో ఉపాధి పనులు నిర్వహించడం లేదు. ఈ వారంలో సుమారు 12,229 కూలీల పని దినాలు నమోదు అయ్యాయని ఏపీవో సుశీల్‌కుమార్ తెలిపారు. కూలీలకు తగిన విధంగా వేతనం రావడానికి రికార్డులను పటిష్టంగా నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...