19న కాళేశ్వరానికి సీఎం కేసీఆర్‌ రాక


Fri,May 17, 2019 03:22 AM

-కాళేశ్వర ఆలయంలో పూజలు
-అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్‌ వెట్న్‌
-మేడిగడ్డ బరాజ్‌ పనుల పరిశీలన
కాళేశ్వరం,మే 16: ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే భగీరథ ప్రయత్నంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ మూడుసార్లు ప్రాజెక్టును సందర్శించారు. మరోసారి ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించడానికి ముహూర్తం ఖరారైనట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈనెల 19వ తేదీ లేదా 20వ తేదీన కేసీఆర్‌ పర్యటన మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి ఆరంభం కానున్నట్లు ఇక్కడి అధికార యంత్రాంగానికి సమాచారం అందడంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మొదట కాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెట్న్‌ చేస్తారు.

అనంతరం మేడిగడ్డ బారాజ్‌ పనులను పరిశీలిస్తారు. దీంతో మేడిగడ్డ, కన్నెపల్లి, గ్రావిటీ కెనాల్‌ వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతోపాటు ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన అనంతరం ఇప్పటి వరకు రెండు సార్లు వచ్చి ఈ ప్రాజెక్టుల పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. నిర్ణీత గడువులోనే ప్రాజెక్టు పనులను పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలనే సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు సాగునీటి ప్రాజెక్టు అధికారులు కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ‘నేనే స్వయంగా వస్తా.. ప్రాజెక్టు పనులను దగ్గర నుంచి చూస్తా..’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్లుగానే ప్రాజెక్టుకు వస్తుండగా, అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగానే కన్నెపల్లి పంప్‌హౌస్‌ను కూడా వెట్న్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సీఎం చేతుల మీదుగానే కన్నెపల్లి వెట్న్‌.్ర.
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భూమిక పోషించే కన్నెపల్లి పంప్‌హౌస్‌ పనులు మొత్తం పూర్తి కావడంతో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగానే కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెట్న్‌ చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను నాలుగోసారి పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ వస్తున్నట్లు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో పనిలో పనిగా కన్నెపల్లి పంప్‌హౌస్‌ పూర్తయిన దృష్ట్యా అపర భగీరథుడి చేతుల మీదుగానే వెట్న్‌ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...